Telangana
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. అభం శుభం తెలియని రెండేళ్ల బాలుడి దుర్మరణం..!
విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి రెండేళ్ల నిండు ప్రాణం బలి ! తెరిచి ఉన్న ప్యానెల్ బోర్డు ఫెన్సింగ్.. లోపలికి వెళ్లిన బాలుడికి తీగలు తగిలి విద్యుత్ షాక్.. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమే తమ కుమారుడి మృతికి కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ.. శేరిలిగంపల్లి, వార్తమ్యాన్ : విద్యుత్ శాఖ నిర్లక్ష్యం చందానగర్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఓ రెండేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. అస్తవ్యస్తంగా, ఎలాంటి రక్షణ లేకుండా వదిలేసిన విద్యుత్ […]
బయటపడ్డ నిత్య పెండ్లి కొడుకు మరో బాగోతం.. ఐటీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపి.. 50 మంది నుండి 2 నుండి 5 లక్షల వరకు వసూళ్లు రినోవేషన్ పేరుతో కంపెనీ మూసేసిన నిందితులు.. నిరుద్యోగులను ముంచింది.. నిత్య పెండ్లి కొడుకే.. 2022లో 13 మందిని పెండ్లి చేసుకొని మోసం చేసిన అడప శివ శంకర్ బాబు.. శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : విడాకులు తీసుకున్న మహిళలను టార్గెట్‌గా చేసుకొని 13 మంది మహిళలను పెండ్లి చేసుకున్న నిత్య పెండ్లి కొడుకు అడప శివ శంకర్‌బాబు […]
మియాపూర్ జీఎస్ఎం మాల్ వద్ద ఘోర ప్రమాదం..పేలిన బెలున్లు నింపే గ్యాస్ సిలిండర్..
సిలిండర్ తగలి తెగిపడిన వ్యక్తి కాలు పాదం.. మరో నలుగురికి గాయాలు.. శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : మియాపూర్ జాతీయ రహదారి వెంట ఉన్న జీఎస్ఎం మాల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హీలియం గ్యాస్ సిలిండర్‌తో బెలూన్లు నింపుతుండగా ప్రమాదవశాత్తు సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఐస్‌క్రీం అముతున్న వ్యక్తి కాలు పాదం తెగిపడిపోయింది. ఈ ప్రమాదంతో స్థానికంగా భయానక వాతావరణం ఏర్పడింది. సిలిండర్ పేలిన ఘటనలో […]
నియో శ్రీచైతన్యలో బోనాల సందడి
పోతురాజుల విన్యాసాలు, బోనం ఎత్తిన చిన్నారులు శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : గోపన్‌పల్లి ఎన్టీఆర్నగర్లోని నియో శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని విద్యార్థులకు పరిచయం చేస్తూ నిర్వహించిన ఈ వేడుకల్లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్, కరస్పాండెంట్ ఉమా, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు పసుపు, కుంకుమ, నైవేద్యాలతో బోనం సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ […]
సూర్య పిన్నాకిల్–3లో 42 పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన
పటాన్ చెరువు, వార్తమ్యాన్ : సూర్య ది గ్లోబల్ స్కూల్ అమీన్పూర్ క్యాంపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్య పిన్నాకిల్–సీజన్ 3 ఘనంగా సాగింది. ఇందులో 42 పాఠశాలలకు చెందిన 1,200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఆర్ట్, డ్యాన్స్, బాస్కెట్‌బాల్, ఖో-ఖో పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా సూర్య ది గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్, ట్రస్టీ ఏవిఎల్ ధరిత్రి మాట్లాడుతూ… ఇలాంటి వేదికలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయని […]
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..రోడ్డు దాటుతున్న యువకులను కారుతో ఢీకొట్టిన పదహారేండ్ల బాలుడు
రోడ్డు దాటుతున్న యువకులను ఢీకొట్టిన కారు.. ఒకరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు.. మైనర్ కొడుక్కు కారు ఇచ్చిన తండ్రితో పాటు మైనర్ బాలుడిపై కేసు అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పదహారేండ్ల బాలుడు తన మరో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి కారుతో వేగంగా దూసుకువచ్చి రోడ్డు దాటుతున్న ముగ్గురు యువకులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడి చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ సంఘటన […]
ప్రేమించలేదని యువతి, అమె తల్లిపై కత్తితో దాడి.. తల్లి మృతి.. యువకుడికి జీవిత కాలం జైలు శిక్ష
ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో కక్ష్య పెంచుకున్న యువకుడు.. యువతి, అమె తల్లిపై కత్తితో దాడి. అపై గొంతు కోసుకున్న యువకుడు.. ఆసుపత్రిలోల చికిత్స పొందుతూ తల్లి మృతి.. యువకుడు అరెస్ట్.. మూడు సెక్షన్లలో జీవిత కాలం కఠిన జైలు శిక్ష, రూ. 25 వేలు ఫైన్ విధించిన కోర్టు.. తనను దూరం పెడుతుందని ప్రేమించిన యువతిపై కోపం పెంచుకున్న యువకుడు అమె ఇంటికి చేరుకొని ప్రేయసి, అమె తల్లిపై కత్తితో దాడి చేసి […]
తల్లి ఒడిలో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. లక్షన్నరకు అమ్మకానికి పెట్టి..
ఫుత్‌పాత్‌పై తల్లి ఒడిలో పడుకున్న మూడేళ్ల చిన్నారి కిడ్నాప్.. మహబూబ్‌నగర్‌లో పిల్లలు లేని మహిళకు లక్షన్నరకు అమ్మేందుకు సిద్ధమైనా ముఠా.. సీసీ కెమెరాలను జల్లెడ పట్టి.. ముగ్గురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం.. సైబరాబాద్, వార్త మ్యాన్ : సం తానం లేని దంపతులకు పిల్లలను విక్రయించే ప్రయత్నం చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్‌పాత్‌పై […]
మాదాపూర్‌లో అర్ధరాత్రి యువకుడి దారుణ హత్య..
తన ఇద్దరు కుమార్తెలను వేధించిన యువకుడిని హత్య చేసిన తండ్రి, మేనమామా కత్తితో పొడిచి. .. కర్రలతో కొట్టి దారుణ హత్య.. హత్య అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఇద్దరు నిందితులు.. మరో ముగ్గురి కోసం గాలింపు.. తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్నాడని ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఓ తండ్రి తన బావమరిది, మరో ముగ్గురితో కలిసి యువకుడిని కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య […]
ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్
గంగారం బస్తీ దవాఖానలో ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్.. దవాఖానకు వచ్చే రోగులకు పొంచి ఉన్న ప్రమాదం.. వైద్యాధికారులు, విద్యుత్ శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు.. అదో బస్తీ దవాఖాన.. చుట్టూ ఉన్న పేద ప్రజలు తమకు సుస్తి చేస్తే వైద్య సేవలకు అక్కడి వస్తారు. బాలింతలు తమ శిశువులకు టీకాలు వేపించడానికి ఈ దవాఖానకే వస్తారు. దవాఖాన వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా దవాఖానకు వచ్చే రోగులు, బాలింతలు, చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే […]
