సూర్య పిన్నాకిల్–3లో 42 పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన
1 min read

సూర్య పిన్నాకిల్–3లో 42 పాఠశాలల విద్యార్థుల ప్రతిభ ప్రదర్శన

 

పటాన్ చెరువు, వార్తమ్యాన్​ :  సూర్య ది గ్లోబల్ స్కూల్ అమీన్‌పూర్ క్యాంపస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సూర్య పిన్నాకిల్–సీజన్ 3 ఘనంగా సాగింది. ఇందులో 42 పాఠశాలలకు చెందిన 1,200 మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఆర్ట్, డ్యాన్స్, బాస్కెట్‌బాల్, ఖో-ఖో పోటీల్లో ప్రతిభ కనబరిచారు.

ఈ సందర్భంగా సూర్య ది గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపల్, ట్రస్టీ ఏవిఎల్ ధరిత్రి మాట్లాడుతూ… ఇలాంటి వేదికలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సృజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు.

 

డ్యాన్స్‌లో మెరు ఇంటర్నేషనల్ స్కూల్, బాస్కెట్‌బాల్‌లో జెనెసిస్ (బాలురు), రాక్‌వెల్ (బాలికలు), ఖో-ఖోలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ (బాలురు), సూర్య ది గ్లోబల్ స్కూల్ బాచుపల్లి (బాలికలు) విజేతలుగా నిలిచాయి. కార్యక్రమం విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచింది.