స్నేహితుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలి..
తెల్లవారుజామున టిఫిన్ చేసేందుకు ఐటీ కారిడార్‌కు వచ్చిన నలుగురు యువకులు
బైక్ అదుపుతప్పి డిడైర్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి
ప్రాణాపాయ స్థితిలో బైక్ నడిపిన యువకుడు
ఓ స్నేహితుడి నిర్లక్ష్యానికి మరో స్నేహితుడు బలయ్యాడు. నలుగురు యువకులు తెల్లవారుజామున టిఫిన్ చేద్దామని రెండు బైకులపై ఐటీ కారిడార్‌కు వెళ్లారు. అక్కడ టిఫిన్ దొరక్కపోవడంతో తిరిగి ఇంటికి బయలుదేరారు. ఇందులో ఓ యువకుడు బైక్‌ను స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో కంట్రోల్ తప్పి రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కుర్చొన్న యువకుడి తలకు తీవ్ర గాయాలై మృతి చెందగా, బైక్ నడిపిన వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి పిజేఆర్ ఫ్లైఓవర్‌పై ఈ ప్రమాదం జరిగింది.
.పుప్పాలగూడ శ్రీ చండేశ్వర యునిక్యూ రెసిడెన్సీలో నివాసం ఉండే వికాస్ కుమార్ నీపక్(25) ప్రైవేటు ఉద్యోగి. హఫీజ్‌పేట్ మార్తండనగర్లో నివాసం ఉండే పిల్లి కళ్యాణ్, గణేష్, భరత్‌కుమార్ నలుగురు స్నేహితులు. వీరు నలుగురు కలిసి సోమవారం ఉదయం 4 గంటల సమయంలో రెండు బైకులపై టిఫిన్ చేసేందుకు హఫీజ్‌పేట్ నుండి నానక్‌రాంగూడకు వెళ్లారు. అక్కడ టిఫిన్ లభించకపోవడంతో తిరిగి హఫీజ్పేట్కి బయలుదేరారు. ఒక బైక్‌పై భరత్‌కుమార్, వికాస్కుమార్ మరో బైక్‌పై కళ్యాణ్ గణేష్‌లు ప్రయాణిస్తున్నారు.

భరత్‌కుమార్ బైక్‌ను నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్‌గా డ్రైవ్ చేయడంతో గచ్చిబౌలి పిజేఆర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే బైక్ అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుకాల కుర్చొన్న వికాస్కుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వికాస్ మృతి చెందాడు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భరత్‌కుమార్ మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి కూడా విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి స్నేహితుడు కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
