గురువుకి పూర్వ విద్యార్థులు నాట్యార్పితం..
మాదాపూర్ శిల్పారామంలో శ్రీనివాస కూచిపూడి ఆర్ట్ అకాడమీ పూర్వ విద్యార్థులు “శోభాలంకృతం” గా పద్మ శ్రీ డాక్టర్ శోభా నాయుడుకి నాట్యార్పితం చేశారు.

గణేశా పంచరత్న, జతిస్వరం, గణేశా కౌతం, దశావతరం, శ్రీవల్లి దేవసేనాపథి, మామవతు శ్రీ సరస్వతి, తిల్లాన, కృష్ణ శబ్దం, భామాకలాపం, నమో నమో రఘుకుల నాయక, కొలువైఉన్నదే, దేవా దేవం భజే, శ్రీ గౌరీ సుతం,కుంతలారావాలి తిల్లాన మొదలైన అంశాలను పద్మ హేమమాలిని, సుజాతామూర్తి , ఉష కిరణ్ , లావణ్య, శ్రీదేవి, కృష్ణ భారతి, ఉష గోటేటి, యశోద ఠాకూర్, సాగరిక, స్వాతి మొదలైన గురువులు వారి శిష్య బృందంతో ప్రదర్శించారు.
కళాకారుల నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. తమ నృత్యంతో కళ్లను కట్టిపడేశారు.
