యువకుడిని హిరో చేస్తానని మోసం చేసిన ప్రముఖ సినీ డైరెక్టర్‌పై కేసు
కొడుకుని హిరో చేస్తానని తండ్రి వద్ద రూ. 4.50 కోట్లు వసూళు
సినిమా తీయకుండా, డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన డైరెక్టర్ అశోక్‌బాబు
అశోక్‌బాబు, భార్య విజయలక్ష్మీపై సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు
మీ కుమారుడిని సినిమా హిరో పరిచయం చేస్తానని అతని తండ్రి వద్ద రూ. 3.50 కోట్లు వసూళు చేశాడో ఒ ప్రముఖ డైరెక్టర్. డబ్బులు తీసుకొని సినిమా తీయకుండా మోసం చేయడమే కాకుండా తిరిగి డబ్బులు అడిగిన ఆ యువకుడి తండ్రిని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో ఆ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు ఆ సినిమా డైరెక్టర్ , అతని భార్య కేసు నమోదు చేశారు.

సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి భాగ్యనగర్‌కాలనీకి చెందిన నాయుడు హనమంతరావు బిజినేస్ చేస్తుంటాడు. హనమంతరావుకు నయీం అనే వ్యక్తి ద్వారా పిల్ల జమిందార్, భాగమతి, ఆకాశరామన్న సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్ అశోక్‌బాబు, అతని భార్య విజయలక్ష్మీ పరిచయం అయ్యారు. తాము ఒక సినిమా తీస్తున్నామని, అందులో మీ కుమారుడిని హిరోగా పరిచయం చేస్తామని చెప్పారు. అంతే కాకుండా సిని పరిశ్రమలో మరిన్నీ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
సినిమా బడ్జెట్ రూ. 8 కోట్ల అవుతుందని, ఆరు నెలల్లో లాభాలతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. వీరి మాటలు నమ్మిన హనమంతరావు డైరెక్టర్ అశోక్‌బాబుకు 2024 సెప్టెంబర్ 3వ తేది నుండి 2025 డిసెంబర్ 2వ తేది వరకు దశల వారిగా రూ. 3.05 కోట్ల డబ్బు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత మరో రూ. 45 లక్షల చెక్‌ను కూడా ఇచ్చాడు. 2024లో హనమంతరావు కొడుకు హిరోగా డైరెక్టర్ అశోక్‌బాబు సినిమా షూటింగ్ ప్రారంభించారు. అయితే సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా డబ్బు మొత్తం అశోక్‌బాబు తన వద్ద పెట్టుకున్నాడు. సినిమా షూటింగ్ పూర్తి చేయాలని, లేదంటే డబ్బులు తిరిగి ఇవ్వాలని హనమంతరావు డిమాండ్ చేయడంతో డైరెక్టర్ అశోక్‌బాబు రూ. 4.50 కోట్లు చెల్లిస్తానని హామీ ఇచ్చి రూ. 50 లక్షల విలువైన నాలుగు చెక్కులు ఇచ్చాడు.
గడువు ముగిసిన డబ్బులు ఇవ్వకపోవడంతో హనమంతరావు డైరెక్టర్ అశోక్‌బాబును నిలదీయగా.. నీ కుమారుడికి ఫ్యూచర్ లేకుండా చేస్తాం, డబ్బులు ఇచ్చేది లేదంటూ బెదిరింపులకు దిగాడు. సినిమా షూటింగ్ పూర్తి చేయకుండా, తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకుండా డైరెక్టర్ బెదిరింపులకు గురిచేయడంతో హనమంతరావు 2025 మే 8వ తేదిన కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కూకట్పల్లి పోలీసులు ఈఓడబ్ల్యూకు ట్రాన్స్ఫర్ చేశారు. జూన్ 10వ తేదిన సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు డైరెక్టర్ అశోక్‌బాబు అతని భార్య విజయలక్ష్మీ, మరికొందరిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం డైరెక్టర్ అశోక్‌బాబు, అతని భార్య విజయలక్ష్మీలను సైబరాబాద్ పోలీసులు విచారించారు.
