Telangana
శేరిలింగంపల్లి ప్రజలపై వెంకటేశ్వర స్వామి అశీస్సులుండాలి.. ఎమ్మెల్యే గాంధీ
వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో శేరిలింగంపల్లి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉండాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ అరెకపూడి గాంధీ అకాంక్షించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఏక వింశ:(21 వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శుక్రవారం […]
శిల్పారామంలో మొదలైన గాంధీ శిల్ప బజార్
శిల్పారామం మాదాపూర్ లో చత్తీస్ఘడ్ హస్తశిల్ప వికాస్ బోర్డు, డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ సౌజన్యంతో శిల్పారామం ఆవరణ లో “గాంధీ శిల్ప బజార్” హస్తకళా మేళ శుక్రవారం ప్రారంభమైంది. చత్తీస్ఘడ్ నుండి విచ్చేసిన హస్తకళాకారులు మెటల్ ఆర్ట్ , మెటల్ జ్యువలరీ, జ్యూట్ క్రాఫ్ట్ , గోండ్ పెయింటింగ్, గోండ్ పెయింటింగ్డ్స్ స్టోల్స్, డ్రెస్ మెటీరియల్స్, క్రాఫ్ట్, సిసెల్ క్రాఫ్ట్ , బస్తర్ ఢోక్ర క్రాఫ్ట్, బస్తర్ వుడ్ కార్వింగ్, వెదురు బొంగు తో తయారు […]
ఐటీ కారిడార్‌లో కబ్జాదారుల చెర నుండి 2500 గజాల పార్కు స్థలం సేఫ్
హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలను తొలగించింది. గచ్చబౌలి ప్రాంతంలో పార్కును కాపాడగా.. శామీర్‌పేటలో రోడ్డు ఆక్రమణలను తొలగించి అక్కడి నివాసితులకు దారి చూపింది. ఈ రెండు ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గజాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500ల గజాల వరకూ ఆక్రమణలు జరిగిపోయాయి. […]
హిట్ అండ్ రన్లో ప్రాణాలో పోకుండా కాపాడటమే తమ లక్ష్యం…
ఇటీవల వరుస హిట్ అండ్ రన్ ప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు ఫుట్‌పాత్‌లపై నిద్రస్తున్న బిక్షాటనదారుల రక్షణే లక్ష్యంగా మియాపూర్ పోలీసులు మానవీయ పోలీసింగ్‌కు ఉదాహరణగా నిలిచారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో హిట్ అండ్ రన్ ఘటనలు నమోదవుతున్న పరిస్థితిని గమనించిన పోలీసులు, ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న భిక్షాటనదారుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని ముందే అంచనా వేసి, రోడ్డు ప్రమాదాలు నివారించాలన్న ఉద్దేశంతో ప్రత్యేకంగా ప్రివెంటివ్ డ్రైవ్ నిర్వహించారు. మియాపూర్ […]
దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా నజర్
దుర్గం చెరువు దుర్గంధంపై హైడ్రా ఫోకస్ పెట్టింది. చెరువులో మురుగునీరు చేరి కంపు కొడుతుండడం, నీటిపై భారీగా గుర్రపుడెక్క తేలియాడుతుండడంపై ఫిర్యాదుల వచ్చిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం దుర్గం చెరువును పరిశీలించారు. చెరువులో సగభాగం వరకూ గుర్రపు డెక్క వ్యాపించడానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఎస్‌టీపీలు ఉన్నప్పటికీ వరద కాలువ ద్వార మురుగు నీరు నేరుగా దుర్గం చెరువులోకి కలవడం పట్ల కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌టీపీల సామర్థ్యానికి మించిన […]
భయపడకండి.. మీ ఇండ్ల జోలికి రాము.. ఆ కాలనీలకు భరోసానిచ్చిన హైడ్రా
మీరు ఏలాంటి భయాందోళన చెందవద్దు. మీ కాలనీలలోకి హైడ్రా వచ్చి మీరు ఉంటున్న ఇండ్లను కూల్చివేయదు. మీరు ఏలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటూ వివాదాస్పద సర్వే నెంబర్ 44లోని పలు కాలనీవాసులకు హైడ్రా భరోసానిచ్చింది. దీంతో ఆయా కాలనీ నివాసితులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండు రోజులు హైడ్రా తమ ఇండ్లను కూల్చివేస్తుందేమోనని కంటి మీద కునుకు లేకుండా గడిపిన కాలనీవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా హైడ్రా తీపికబురు అందించింది. శేరిలింగంపల్లి […]
చందానగర్ పోలీస్ స్టేషన్‌ను అకస్మిత తనిఖీ చేసిన శేరిలింగంపల్లి డీసీపీ
చందానగర్ పోలీస్ స్టేషన్‌ను శేరిలింగంపల్లి జోన్ డీసీపీ శ్రీనివాస్ అకస్మిక తనిఖీలు చేశారు. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీసీపీ శ్రీనివాస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసుల వివరాలను తెలుసుకొని రికార్డులను పరిశీలించారు. రికార్డులను నిర్వహిస్తున్న తీరుపై డీసీపీ ఇన్స్పెక్టర్, అడ్మిన్ ఎస్ఐపై అగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఫిర్యాదులు చేసేందుకు వచ్చే వారి పట్ల గౌరవంగా మాట్లాడుతూ భరోసా కల్పించాలని డీసీపీ సిబ్బందికి […]
హైటెక్‌సిటీలోని ఆ రూట్లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్ తిప్పలే..
హైటెక్‌సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్‌టీయూ వెళ్లే వెహికిల్స్ మరో రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ […]
హైటెక్‌సిటీలో దారుణం.. యువకుడి చేతికి కట్ చేసిన చైనా మాంజా..
చైనా మాంజా ఈ పేరు వింటే బైకర్లు హడలెత్తిపోతున్నారు. బైక్‌పై వెళ్తుండగా ఎక్కడ చైనా మాంజా తగిలి ప్రాణాపాయం అవుతుందో అని భయాందోళన చెందుతున్నారు. ఇటీవల చైనా మాంజాలు మెడకు తలిగి చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. చైనా మాంజా ఉపయోగించవద్దు ప్రాణాలు పోతున్నాయి అని ఒక వైపు పోలీసులు అవగాహన కల్పిస్తున్న వ్యాపారులు మారడం లేదు. బ్లాక్ మార్కెట్లో చైనా మాంజా అమ్ముతూ ప్రజల ప్రాణాలు హరిస్తున్నారు. వినయోగదారులు అదే చైనా మాంజాలతో పతంగులు ఎగరవేసి […]
హైటెక్‌సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం
ఐటీ కారిడార్‌లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్‌టీయూ వెళ్లే రూట్లో సైబర్ గేట్‌వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు. ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్‌టీయూ […]
