హైటెక్ నగరంలో మురుగు ప్రవాహం..
గచ్చిబౌలి ఇందిరా నగర్లో పొంగిపొర్లుతున్న మురుగునీరు..
మురుగు సమస్య పరిష్కరించాలి.. బీజేపీ నేత.. రవికుమార్యాదవ్
శేరిలింగంపల్లి, వార్త మ్యాన్ : ఐటీ కారిడార్లో ఒకవైపు ప్రపంచ పేరు గాంచిన ఐటీ కంపెనీలు కొలువై ఉన్నాయి. అభివృద్ధిలో దూసుకుపోతున్న హైటెక్ నరగంలో చిన్న వర్షం కురిస్తే మురుగునీరు ఉప్పొంగి ప్రవహిస్తుంది. పేరుకే హైటెక్ నగరం తప్పా.. అభివృద్ధికి నోచుకోని కాలనీలు ఇంకా ఉన్నాయి. పాలకులు, ప్రజాప్రతినిధులు మారుతున్న కొన్ని కాలనీలు, బస్తీలు మాత్రం అభివృద్దికి నోచుకోవడం లేదు.
గచ్చిబౌలి ఇందిరానగర్లో గత నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షానికి మురుగునీరు వరదలా ప్రవహిస్తుంది. మురుగునీరు కాలనీ రోడ్లను ముంచెత్తింది. దీంతో ఈ కాలనీలో నివాసం ఉండే ప్రజలు, హాస్టళ్లలో ఉండే ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగు దుర్వాసన భరించలేక పోతున్నామని వాపోతున్నారు. ఇందిరానగర్ సమస్యను స్థానికుల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ శనివారం ఇందిరానగర్లో పర్యటించారు. స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించి సమస్యపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఇందిరా నగర్ లో నాలా, డ్రైనేజీ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా ఉందని, అనేక సార్లు పర్యటించి జీహెచ్ఎంసీ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అంజయ్య నగర్ నాలాను రాడిసన్ హోటల్ వద్ద గచ్చిబౌలి గ్రామం మీదుగా వెళ్ళే నాలా లో కలపడం జరిగిందని, గతంలోనే సమస్య ఉన్న నాలా లో కలిపితే ఉన్న సమస్య తగ్గకపోగా పెద్దదిగా మారుతుందని ఆలోచన లేకుండా పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏళ్లు గడుస్తున్న సమస్య మారలేదని, శాశ్వత పరిష్కార మార్గం చూపకపోగా ,కొత్త సమస్యను తెచ్చిపెట్టినట్లుందని ప్రజా ప్రతినిధులు, అధికారులు తీరుకు ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. తక్షణమే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి కంటేస్టేడ్ కార్పొరేటర్ ఎల్లేష్, నాయకులు మఖన్ సింగ్, నరసింహ, మహేందర్ యాదవ్, శశాంక్, రోహిత్, జై హింద్, మధు, రాఘవ చారి, రఘునాథ్, సుబ్రమణ్యం, దినేష్, రాము స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
