1 min read

ఐరన్​ గేటు మీద పడి బాలుడు మృతి…

ఐరన్​ గేటుతో ఆడుకుంటుండగా అది మీద పడి బాలుడు మృతి చెందాడు. ఉత్తర్​ప్రదేశ్​ రాష్ర్టం కేపార్వర్​ గ్రామానికి చెందిన వీరేంద్రశర్మ, జ్ఞాణి దంపతులకు కుమార్తె, కుమారుడు రియాన్స్​శర్మ(రెండున్నర సంవత్సరాలు) సంతానం. వీరేంద్రశర్మ కుటుంబాన్ని సొంతూరిలోనే ఉంచి గత ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్​ నగరానికి వలస వచ్చి మియాపూర్​ బీకే ఎంక్లేవ్​లో నివాసం ఉంటూ స్థానికంగా సాయి బాలాజీ ఫ్యాబ్రికేటెడ్​లో పనిచేస్తున్నాడు.

 

రెండు రోజుల క్రితం వీరేంద్రను చూసేందుకు భార్య తన కుమారుడితో కలిసి హైదరాబాద్​కు వచ్చింది. శనివారం ఉదయం భార్యభర్తలు ఇద్దరు పనిచేస్తుండగా వీరి కుమారుడు రియాన్స్​ అక్కడే ఉన్న ఐరన్​ గేట్​తో ఆడుకుంటుండగా అది మీద పడింది. తీవ్రంగా గాయపడ్డ కుమారుడిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న మియాపూర్​ పోలీసులు ఆసుపత్రికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీకి తరలించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ​