సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ‘ఏఐ’
సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలువుతున్న ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు గచ్చిబౌలిలోని పీఎస్‌ఐఓసీ, ఎస్సీఎస్సీ మీటింగ్ హాల్లో సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్‌కు చెందిన ‘ట్రాన్స్‌కాలిటీ’ సంస్థ సీఈఓ డాక్టర్ లూకాస్ అంబుల్ […]
శేరిలింగంపల్లి తహసీల్ధార్ బదిలీ.. నూతన తహసీల్దార్‌గా మహిపాల్‌రెడ్డి
శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతనిలో పాటు తెలంగాణ రాష్ర్టంలో పలువురు డిప్యూటీ, అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి నూతన ఎమ్మార్వోగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓగా పనిచేస్తున్న మహిపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. జోగులాంబా గద్వాల జిల్లా డిఆర్ఓగా పద్మజరాణి, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా హరిప్రియ, అదిలాబాద్ అడిషనల్ […]
మార్చిలో పదవ తరగతి పరీక్షలు… అంతలోనే ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి
మార్చి నెలలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మియాపూర్‌లో జరిగింది. బీదర్ రాష్ర్టం బాల్కి గ్రామానికి చెందిన రేవల సిద్ధయ్య భార్య, ఇద్దరు కుమారులతో కలిసి ఓల్డ్ హఫీజ్‌పేట్‌లోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. సిద్ధయ్య ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా, పెద్ద కుమారుడు స్థానికంగా ఉన్న డీమార్ట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండవ కుమారుడు శంకర్ సొంతూరిలో గత సంవత్సరం […]
ఐటీ కారిడార్‌లో డెడ్ డ్రాప్ కోడ్ లాంగ్వేజ్‌తో డ్రగ్స్ దందా..
వైఫైతో కనెక్ట్ అయ్యి… వాట్సప్‌లో అర్డర్ తీసుకోని.. డెడ్ డ్రాప్ అనే కోడ్‌తో.. డ్రగ్స్ పెట్టి కస్టమర్లకు లోకేషన్ పెట్టి.. ఐటీ కారిడార్‌లో నయా డ్రగ్స్ దందా.. ముగ్గురు అరెస్ట్.. 32 గ్రాముల కొకైన స్వాధీనం.. ఐటీ కారిడార్ డ్రగ్స్ అమ్మేందుకు డ్రగ్ పెడ్లర్లు రోజు రోజుకు కొత్త దారులు వెతుకున్నారు. ప్రత్యేకంగా కోడ్ బాష ఉపయోగించి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా భయ్యా బచ్చే ఆగయా పేరుతో కోడ్ లాగ్వేజ్ […]
శిల్పారామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుండి సందర్శకులు శిల్పారామంకు భారీగా తరలివచ్చారు. శిల్పారామంలోని అంపి థియేటర్లో నిర్వహించిన కళాకారులు నృత్యాలు ఆహుతులను మైమరిపించాయి. శ్రీ గీతికా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురువర్యులు లక్ష్మి కృష్ణ శిష్య బృందం మహా గణపతిమ్, శ్రీ విజ్ఞ రాజాం భజే, శివ శంభో, తిల్లాన, శివ స్తుతి, నటరాజ తాండవం, నృత్యాంజలి తిల్లాన, ఆంగికం మహా దేవా శంకర, […]
ఐటీ కారిడార్‌లో రోడ్ల విస్తరణకు ముమ్మర కసరత్తు
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడమే లక్ష్యంగా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్డు విస్తరణ పనులపై దృష్టి సారించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కీలక మార్గాల్లో నెలకొన్న బాటిల్‌నెక్‌లను తొలగించి, రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు శనివారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీజన, జలమండలి అధికారి అశోక్ రెడ్డి , శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ భోర్కడే హేమంత్ సహదేవరావు , ట్రాఫిక్-1 డీసీపీ జె. రంజన్ రతన్ కుమార్‌తో […]
ఐటీ కారిడార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. 57 లక్షలతో జంపైన డ్రైవర్
ఏటిఎంలో క్యాష్ నింపే వాహనంతో పరారైన డ్రైవర్.. కొద్దిదూరంలో వాహనాన్ని వదిలేసి 57 లక్షలతో జంప్ ఐటీ కారిడార్‌లో పట్టపగలు ఓ భారీ దోపిడీ జరిగింది. ఏటిఎం సెంటర్లలో క్యాష్ నింపేందుకు వెళ్లిన ఓ డ్రైవర్ డబ్బులు ఉన్న వాహనంతో పాటు పరారయ్యాడు. వాహనంలో ఉన్న ఇద్దరు కస్టోడియన్లు ఏటిఎంలో డబ్బులు పెడుతుండటం, సెక్యూరిటీ గార్డు మూత్ర విసర్జన కోసమని బయటకు వెళ్లడంతో ఇదే అదునుగా వాహనంతో పాటు డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. […]
హైటెక్‌సిటీలో రూ. 2200 కోట్ల భూమిని రక్షించిన హైడ్రా
రూ. 2200 కోట్ల విలువైన 11 ఎకరాల భూమిలో అక్రమణలు తొలగింపు.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు మాధాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌కు చేరువలో హైడ్రా భారీ ఆపరేషన్‌ను గురువారం నిర్వహించింది. వందలాది తాత్కాలిక షెడ్డులను, పదుల సంఖ్యలో ఉన్న షాపులను తొలగించింది. మొండి కుంట ఆక్రమణలను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ వేసింది. చెరువుతో పాటు.. పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలు తొలగించి 11 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. […]
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్ ఎస్ఐ వినయ్
హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్ఐ వినయ్ పోలీస్ డిపార్ట్మెంట్లో మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. ఓ కేసులో నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని మాదాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వినయ్ లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి మొదటి విడుతలో రూ.50వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ ఐటీ ఉద్యోగి
అఫీస్ నుండి ఐటీ ఉద్యోగి ఇంటికి కారులో వెళ్తుండగా ఇంజిన్ నుండి పొగలు వచ్చి క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించారు. వెంటనే అప్రమత్తమైన ఐటీ ఉద్యోగి కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మాదాపూర్ సీసీఆర్టీ వద్ద జరిగింది. ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉండే బి. రాఘవకృష్ణ మంగళవారం సాయంత్రం తన షిఫ్ట్ డిజైర్కారు(టీఎస్08ఎఫ్‌కె3459)లో గచ్చిబౌలిలోని అఫీస్ నుండి ఇజ్జత్‌నగర్‌లోని ఇంటికి బయలుదేరాడు. కారు మాదాపూర్ సీసీఆర్టీ వద్దకు చేరుకోగానే ఇంజిన్ […]
