ప్రేమించలేదని యువతి, అమె తల్లిపై కత్తితో దాడి.. తల్లి మృతి.. యువకుడికి జీవిత కాలం జైలు శిక్ష
ప్రేమించిన యువతి దూరం పెట్టడంతో కక్ష్య పెంచుకున్న యువకుడు..
యువతి, అమె తల్లిపై కత్తితో దాడి. అపై గొంతు కోసుకున్న యువకుడు..
ఆసుపత్రిలోల చికిత్స పొందుతూ తల్లి మృతి..
యువకుడు అరెస్ట్..
మూడు సెక్షన్లలో జీవిత కాలం కఠిన జైలు శిక్ష, రూ. 25 వేలు ఫైన్ విధించిన కోర్టు..
తనను దూరం పెడుతుందని ప్రేమించిన యువతిపై కోపం పెంచుకున్న యువకుడు అమె ఇంటికి చేరుకొని ప్రేయసి, అమె తల్లిపై కత్తితో దాడి చేసి అనంతరం తాను గొంతు కోసుకకున్నాడు. తీవ్ర గాయాలపాలైన యువతి తల్లి చికిత్స పొందుతున్న మృతి చెందింది. ఈ కేసులో మియాపూర్ పోలీసులు యువకుడిని అరెస్ట్ చేయగా.. విచారణ చేపట్టిన న్యాయస్థానం గురువారం నిందితుడికి జీవిత కాలం కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 25వేలు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
గుంటూరు జిల్లా రెపల్లె దగ్గర ఇసుకపల్లి గ్రామానికి చెందినవెంకటరాజు శోభ దంపతులకు కుమారుడు గోవర్ధన్, కుమార్తె వైభవి(19) సంతానం. వెంకటరాజు ముంబాయ్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తుండగా, శోభ పిల్లలతో కలిసి సొంతూరులోనే నివాసం ఉండేది. ఇదే గ్రామానికి చెందిన సందీప్(25) కూలీ పనులు చూస్తుండేవాడు. మూడు సంవత్సరాల క్రితం సందీప్, వైభవి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ విషయం వైభవి ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో గత రెండు సంవత్సరాలుగా వైభవి సందీప్‌కుమార్ దూరం పెడుతూ వస్తుంది. అతని ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసింది.
వైభవి సందీప్ ఫోన్‌ను నెంబర్‌ను బ్లాక్ చేసింది. దీంతో సందీప్ ఇతర ఫోన్ నెంబర్ల నుండి వైభవికి కాల్స్ చేస్తూ తనతో ఫోన్ మాట్లాడాలని, లేకపోతే సూసైడ్ చేసుకుంటానని బెదిరించేవాడు. లేకపోతే చంపేస్తానని హెచ్చరించేవాడు. సందీప్ వేధింపులు భరించలేకపోవడం, తన అన్న గోవర్ధన్‌కు హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో వైభవి 2022 మే నెలలో నగరానికి వచ్చి న్యూ హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్నారు.
తల్లి శోభ కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద ఉన్న ఓ దుకాణంలో పనిచేస్తుండగా, సోదరుడు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, వైభవి ఇంట్లోనే ఉంటుంది. వైభవికి వరుసకు మామ అయ్యే వ్యక్తితో పెండ్లి చేయాలని కుటుంబసభ్యులు డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 18వ తేదిన ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే వైభవికి నిశ్చితార్థం చేస్తున్నారనే విషయం తెలుసుకున్న సందీప్ సొంతూరు నుండి హైదరాబాద్‌కు వచ్చాడు.
వైభవి ఇంటి అడ్రస్ తెలుసుకొని 13వ తేదిన (మంగళవారం) ఉదయం 10 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో ఉన్న వైభవి, తల్లి శోభతో ప్రేమ విషయంపై గొడవపడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేశాడు. ఆ తర్వాత తాను గొంతు కోసుకున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ ముగ్గురిని కొండాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తల్లికూతుళ్లను గాంధీకి, సందీప్‌ను కోఠి ఈఎన్టీ ఆసుపత్రికి తరలించారు.
వైభవికి మెడ కింద గాయం అవ్వగా, ఆమె తల్లికి చాతిపై గాయాలు అయ్యాయి. నిందితుడు సందీప్‌కు గొంతుపై గాయం అయ్యింది. చికిత్స పొందుతూ యువతి తల్లి శోభ 14వ తేదిన మృతి చెందింది. మృతురాలి కుమార్తె వైభవి ఫిర్యాదుతో 302,307,452 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు నిందితుడు సందీప్‌ను 23వ తేదిన అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఈకేసులో దర్యాప్తు పూర్తికాగా మియాపూర్ పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం గురువారం ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా 12వ అదనపు సెషన్స్ జడ్జి టి. అనిత నిందితుడు సందీప్‌ను దోషిగా నిర్ధారిస్తూ 302 సెక్షన్లో జీవిత కాలం కఠిన కారాగార జైలు శిక్ష, పది వేలు ఫైన్, 402 సెక్షన్లో పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, పదివేలు ఫైన్, 452 సెక్షన్ కింద మూడు నెలల సాధారణ జైలు, ఐదు వేలు ఫైన్ విధిస్తూ తీర్పు వెల్లడించారు.
