శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన చింతమనేని ప్రభాకర్
తెలంగాణ రాష్ర్టంలో పలువురు ఐపిఎల్లు బదిలీ అయ్యారు. వీరిలో కొందరిని జీహెచ్ఎంసీలో నూతనంగా ఏర్పాటైన జోన్లకు డీసీపీలుగా ప్రభుత్వం కేటాయించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మాదాపూర్ జోన్ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన శేరిలింగంపల్లి జోన్ డీసీపీగా చింతమనేని ప్రభాకర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీగా చార్జ్ తీసుకున్న ప్రభాకర్‌కు పలువురు పోలీస్ అధికారులు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డీసీపీ ప్రభాకర్ మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి జోన్లో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్ద పీట వేస్తానన్నారు. కేసులు త్వరితగతిలో పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా, దోషులకు శిక్ష పడిలే చూస్తామన్నారు. నూతన డీసీపీకి గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ బాలరాజు, ఇతర ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు స్వాగతం పలికారు.
