రెండో పెండ్లి చేసుకున్న సమంత-– రాజ్ నిడుమోరు
సమంత పెండ్లిపై రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్ వైరల్..
సోషల్ మీడియాలో పెండ్లి ఫోటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ హిరోయిన్ సమంత రెండో పెండ్లి చేసుకున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ డైరెక్టర్ రాజ్ నిడుమోరును పెండ్లి చేసుకున్న ఫోటోలు నెట్టింటా వైరల్‌గా మారాయి. తను పెండ్లి చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా సమంత ఇన్స్ర్టాగ్రాంలో ఫోటోలు షేర్ చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో గత కొంత కాలంగా సమంత డేటింగ్లో ఉన్న విషయం తెలిసిందే.

ది ఫ్యామిలీ మెన్ సిరీస్‌తో పరిచయమై
రాజ్ నిడుమోరు డైరెక్టర్లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మెన్’ మూడు సిరీస్‌లు హిట్ అయ్యాయి. ఈ వెబ్‌సిరీస్ రెండవ సిరీస్‌లో సమంత కూడా నటించారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ కలిసి గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. సమంత నిర్మించిన శుభం అనే సినిమాకు రాజ్ క్రియేటివ్ నిర్మాణగా వర్క్ చేశాడు. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా చేసుకున్న వేడుకల్లో ఇద్దరి ఫోటోలు వైరల్‌గా మారాయి
.
ఈశా యోగా సెంటర్లో పెండ్లి..
ఇదిలా ఉండగా సమంత– రాజ్ నిడుమోరు సోమవారం తెల్లవారుజామున వివాహ బందంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో కుటుంసభ్యులు, సన్నిహితుల మధ్య పెండ్లి జరిగింది. ఈ విషయాన్ని సమంత ఇన్స్ర్టాగ్రాంలో తన పెండ్లి ఫోటోలను షేర్ చేసింది.
సమంత పెండ్లిపై రాజ్ నిడుమోరు మాజీ భార్య పోస్ట్ వైరల్..
టాలీవుడ్ టాప్ హిరోయిన్ సమంత పెండ్లిపై రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామిలి చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’ అని పెట్టిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోమవారం సమంత–రాజ్ నిడుమోరు పెండ్లి జరగడం, ఇదే సమయంలో శ్యామిలి పెట్టిన పోస్ట్‌పై తీవ్ర చర్చ జరుగుతుంది. గతంలో సమంతకు సినీ హిరో నాగార్జున కుమారుడు నాగచైతన్యతో వివాహం జరగ్గా ఇద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే
