ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​
1 min read

ప్రభుత్వ స్థలంలో.. ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​

గంగారం బస్తీ దవాఖానలో ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​..

 

దవాఖానకు వచ్చే రోగులకు పొంచి ఉన్న ప్రమాదం..

 

వైద్యాధికారులు, విద్యుత్​ శాఖ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు..

 

అదో బస్తీ దవాఖాన.. చుట్టూ ఉన్న పేద ప్రజలు తమకు సుస్తి చేస్తే వైద్య సేవలకు అక్కడి వస్తారు. బాలింతలు తమ శిశువులకు టీకాలు వేపించడానికి ఈ దవాఖానకే వస్తారు. దవాఖాన వైద్యాధికారుల నిర్లక్ష్యం కారణంగా దవాఖానకు వచ్చే రోగులు, బాలింతలు, చిన్నారుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది.

 

చందానగర్ గంగారం బస్తీలోని బస్తీ దవాఖానకు చెందిన స్థలంలో ఓ ప్రైవేటు నిర్మాణదారుడి కోసం విద్యుత్​ శాఖ అధికారులు ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు వ్యక్తి కోసం ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయడంపై స్థానికుల నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం..

బస్తీ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్​ఫార్మర్​

 

చందానగర్​ గంగారం గ్రామంలో బస్తీ దవాఖాన ఉంది. ప్రతి బుధ, శనివారాల్లో నెలసూదులు, టీకాల కోసం పెద్ద సంఖ్యలో బాలింతలు తమ శిశువులను తీసుకొని తలిదండ్రులు చిన్నారులతో కలిసి ఈ బస్తీ దవాఖానకు వస్తుంటారు. దవాఖాన ఆవరణలోనే ఓ ప్రైవేటు వ్యక్తి కోసం ట్రాన్స్​ఫార్మర్​ను ఏర్పాటు చేస్తుండడంతో స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేస్తే బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు, చిన్నారులు, వారి తల్లిదండ్రుల ప్రాణాలకు ప్రమాదం సంభవించే పరిస్థితి ఉంది. ఈ వ్యవహారంపై సంబంధిత వైద్యాధికారులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, ఆస్పత్రి ఆవరణలో పనులు జరుగుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

పనులు చేస్తున్న విద్యుత్​ శాఖ సిబ్బంది

 

ప్రభుత్వ భూమిలో..అందులో ఆసుపత్రి ఆవరణలో.. ప్రైవేట్ అవసరాల కోసం ట్రాన్స్​ఫార్మర్​ను బిగించడం కోసం ఎవరు అనుమతి ఇచ్చారు? ఆసుపత్రి భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందే ప్రభుత్వ దవాఖానల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

విద్యుత్​ శాఖ వాహనం

 

బస్తీ దవాఖానలో ప్రైవేటు ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయడంపై ఇటూ విద్యుత్​ శాఖ, అటూ వైద్యాధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బులు తీసుకొని ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు చేయిస్తున్నారా అనే ప్రశ్నలు ఏర్పడుతున్నాయి

 

గంగారం బస్తీ దవాఖానలో ఏర్పాటు చేస్తున్న ఈ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఉన్నతాధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే తక్షణమే తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.