స్నాప్‌చాట్‌లో యువతికి గాలం వేసి హోటల్ రూంకు తీసుకువెళ్లి ఎం చేశాడో తెలుసా ?
స్నాప్‌చాట్‌లో పరిచయం..
ప్రేమ పేరుతో లోబర్చుకున్న యువకుడు..
హోటల్ గదికి తీసుకువెళ్లి కత్తితో బెదిరించి నగ్న ఫోటోలు, వీడియోల రికార్డు..
డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసిన యువకుడు అరెస్ట్..
హైటెక్‌సిటీలో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న యువతికి స్నాప్‌చాట్‌లో ఓ యువకుడి నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్‌ను ఒకే చేయడంతో ఆ యువకుడు అమెను మొదట స్నేహం ముసుగులో మెసేజ్ చేస్తూ నమ్మించాడు. ఆ తర్వాత ప్రేమ పేరుతో యువతిని లోబర్చుకున్నాడు. ఇద్దరం కలుద్దామని హోటల్ గదికి తీసుకువెళ్లాడు. గదిలో ఆ యువకుడి చేసిన పనికి విస్తుపోయింది. ఆ యువకుడు కత్తితో బెదిరించి అమె నగ్న ఫోటోలు, వీడియోలు తన ఫోన్లో రికార్డు చేసుకున్నాడు.
ఆ తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పరువుపోతుందని భయపడ్డ ఆ యువతి అతను అడిగిన డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు. మరిన్నీ డబ్బులు ఇవ్వాలని ఆ యువకుడి బెదిరింపులకు పాల్పడుతుండడంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ ప్రభుద్దుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన గచ్చిబౌలిలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ప్రకాశంకు చెందిన కిలారి నాగతేజ అలియాస్ నాని(24) స్నాప్‌చాట్ ద్వారా ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరు మెసేజ్‌లు చేసుకునేవారు. నాగతేజ ఆ యువతిని ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు. ఇద్దరు కలుద్దామని ఈ నెల 22వ తేదిన గచ్చిబౌలి డిఎల్ఎఫ్ ఎదురుగా ఉన్న ఎల్లో స్టోన్ హోటల్ గదిలో కలుసుకున్నారు.
హోటల్ గదిలో నాగతేజ ఆ యువతిని కత్తితో బెదిరించి బలవంతంగా అమె నగ్న ఫోటోలు, వీడియోలు తన ఫోన్లో రికార్డు చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడి అమె నుండి రూ. 1,10000 డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు. దీంతో భయాందోళన చెందిన యువతి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగతేజను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రెండు సెల్ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. నాగతేజ సోషల్ మీడియా ద్వారా యువతులను పరిచయం చేసుకొని, వారిని ప్రేమ, స్నేహం పేరుతో వంచించి, హోటల్ గదులకు తీసుకువెళ్లి నగ్న ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడి అనేక మంది నుండి డబ్బులు వసూళు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
