వయస్సు 28… దొంగతనాలు 54
మియాపూర్‌లో ఘరానా దొంగ అరెస్ట్..
వాచ్మెన్ ఇండ్లే టార్గెట్‌గా దొంగతనాలు..
మూడు కమిషనరేట్ల పరిధిలో 54 కేసులు..
శేరిలింగంపల్లి, వార్తమ్యాన్ : ఆ యువకుడి వయస్సు ప్రస్తుతం 28… కానీ అతను చేసిన దొంగతనాలు 54.. తను 15 యేటా నుండే దొంగతనాలకు పాల్పడుతున్నాడు. చిన్న వయస్సులోనే దొంగతనాల బాట పట్టిన ఆ యువకుడు 13 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు. ఇంతని ఘరానా దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
మియాపూర్ పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద 3 లక్షల విలువైన వెండి, బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఘరానా దొంగకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వాచ్మెన్ ఇండ్లే టార్గెట్..
నెల్లూరు జిల్లా కావలి మండలం చమడాల గ్రామానికి చెందిన వల్లేపు వెంకటేష్(28) సొంతూరిలో ఏడవ తరగతి వరకు చదువుతుకున్నాడు. చదువు మధ్యలోనే అపేసి కూలీ పనులకు వెళ్లేవాడు. నగరానికి వచ్చి మియాపూర్ ఎఫ్సిఐకాలనీ సమీపంలో నివాసం ఉంటూ ఇసుక బిజినేస్ చేసే ఓ వ్యక్తి వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పనిచేయగా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని డిసైడ్ అయ్యాడు.
స్వతహాగా డబ్బున్న ఇండ్లనే గుర్తించి రెక్కీ నిర్వహించి దొంగతనాలు చేస్తారు. కానీ వెంకటేష్ మరో రూట్ ఎంచుకున్నాడు. కాలనీలు, అపార్ట్మెంట్లలో నివాసం ఉండే వాచ్మెన్ ఇండ్లను టార్గెట్ చేసుకున్నాడు. ముందుగా రెక్కీ నిర్వహించి వాచ్మెన్ ఇండ్లలో ఎవరూ లేని సమయంలో ఇంట్లోని బంగారు, వెండి అభరణాలను దొంగలిస్తాడు.
దొంగలించిన సొత్తు అమ్మేసి జాల్సాలు..
వెంకటేష్ దొంగతనం చేసిన అనంతరం బంగారు, వెండి అభరణాలను తెలిసిన వ్యక్తులకు అమ్మేస్తాడు. వచ్చిన డబ్బులను బెట్టింగ్‌లలో పెట్టడం, మిగిలిన డబ్బును జల్సాలకు వినియోగిస్తాడు.2013 నుండి వెంకటేష్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మొదటి దొంగతనం 2013లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేశాడు. 2015 నుండి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేస్తున్నాడు.
దొరికిండు ఇలా…
ఈ నెల 21వ తేదిన మాతృశ్రీనగర్‌లోని అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న మంజుల ఇంట్లో మధ్యాహ్నం సమయంలో ఓ వ్యక్తి ఇంట్లోకి దూరి వెండి అభరణాలు దొంగలించాడు. దీంతో మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదే పద్దతిలో గతంలో కూడా మియాపూర్‌లో రెండు దొంగతనాలు నమోదు కావడంతో మియాపూర్ పోలీసులు నిందితుడి కోసం నిఘా పెట్టారు.
శుక్రవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లోని మయూరినగర్లో స్కూటీపై అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుడిని మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. గత కొద్ది కాలంగా దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు వెంకటేష్‌గా పోలీసులు గుర్తించారు.వెంకటేష్ నుండి నాలుగు గ్రాముల బంగారం,607 గ్రాముల వెండి అభరణాలు, ఒక్క స్కూటీని స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు.
వయస్సు 28… కేసులు 54
నిందితుడు వయస్సు ప్రస్తుతం 28 సంత్సరాలు. కానీ అతను చేసిన దొంగతనాలు 54.. ఇంకా ఎన్ని చేశాడో తెలియాల్సి ఉంది. 15 సంవత్సరాల వయస్సు నుండే వెంకటేష్ చోరిల బాట పట్టినట్లు పోలీసులు తెలిపారు. వెంకటేష్ మూడు కమిషనరేట్ల పరిధిలో 54 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ తెలిపారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 16 కేసులు, కేపిహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు ఉన్నాయి.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు డీసీపీ పేర్కొన్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, ఇతర జిల్లాల్లో కూడా కేసులు ఉన్నాయా అని ఆరా తీస్తున్నామన్నారు. 2023లో వెంకటేష్ జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. ప్రస్తుతం మియాపూర్‌లోని మూడు కేసులు, గచ్చిబౌలిలోని ఒక కేసులో వెంకటేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.ఈ సమావేశంలో కేపిహెచ్బీ ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, మియాపూర్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్, డీఐ రమేష్ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
