ఐటీ కారిడార్‌లో డెడ్ డ్రాప్ కోడ్ లాంగ్వేజ్‌తో డ్రగ్స్ దందా..
వైఫైతో కనెక్ట్ అయ్యి… వాట్సప్‌లో అర్డర్ తీసుకోని..
డెడ్ డ్రాప్ అనే కోడ్‌తో.. డ్రగ్స్ పెట్టి కస్టమర్లకు లోకేషన్ పెట్టి..
ఐటీ కారిడార్‌లో నయా డ్రగ్స్ దందా..
ముగ్గురు అరెస్ట్.. 32 గ్రాముల కొకైన స్వాధీనం..
ఐటీ కారిడార్ డ్రగ్స్ అమ్మేందుకు డ్రగ్ పెడ్లర్లు రోజు రోజుకు కొత్త దారులు వెతుకున్నారు. ప్రత్యేకంగా కోడ్ బాష ఉపయోగించి డ్రగ్స్ అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా భయ్యా బచ్చే ఆగయా పేరుతో కోడ్ లాగ్వేజ్ ఉపయోగించి డ్రగ్స్ అమ్మకం చేపట్టగా… ప్రస్తుతం డెడ్ డ్రాప్ అనే కోడ్ లాగ్వేజ్ డ్రగ్స్ అమ్మకం సాగిస్తున్నారు.
డ్రగ్ పెడ్లర్లు తమ జాడ తెలియకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. వైఫైతో కనెక్ట్ అయ్యి వాట్సప్‌లో డ్రగ్స్ ఆర్ఢర్ తీసుకొని డబ్బులను ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు. డెడ్ డ్రాప్ అనే కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఒక ప్రదేశంలో డ్రగ్స్ పెట్టి దాని లొకేషన్ కస్టమర్లకు పంపించి డ్రగ్స్ డెలివరీ చేస్తున్నారు.

డెడ్ డ్రాప్ పేరుతో డ్రగ్స్ అమ్మకం చేస్తున్న ఓ అంతరాష్ర్ట డ్రగ్ పెడ్లర్‌తో పాటు అతని ఇద్దరి సహచరులను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. వీరి వద్ద నుండి 32 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురికి డ్రగ్స్ పరీక్షలు చేపట్టింది. ముగ్గురికి పాజిటివ్ రావడంతో అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీసులకు అప్పగించింది.
ఆర్థిక ఇబ్బందులతో చదువు మధ్యలో మానేసి
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మురళి కృష్ణంరాజు(24) ఆర్థిక ఇబ్బందుల కారణంగా బీటెక్ మధ్యలోనే అపేశాడు. ఆతర్వాత ఉత్తరఖాండ్, పూణె, గోవాలలో ఉద్యోగాలు చేసాడు. ఉద్యోగాల చేసిన వచ్చే జీతం విలాసాలకు సరిపోకపోవడంతో ఉద్యోగాలు మానేసాడు. ఇదే సమయంలో చెడు అలవాట్లకు బానిసైన కృష్ణంరాజు డ్రగ్స్ కూడా సేవించేవాడు. ఆ తర్వాత డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టాడు.
కృష్ణంరాజు మొదట మణికొండలో ఓ డ్రగ్ పెడ్లర్ నుండి గ్రాము కొకైన్‌ను రూ.10వేలకు కొనుగోలు చేసి కస్టమర్లకు రూ.11 వేలకు అమ్మాడు. డ్రగ్ పెడ్లర్ అరెస్ట్ కావడంతో కృష్ణంరాజు గోవాలో ఉండే ఓ నైజీరియన్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో రూ. 12 వేలకు గ్రాము చొప్పున అమ్మకం సాగించాడు.

డ్రగ్స్ అమ్మేందుకు డెడ్ డ్రాప్ కోడ్ లాంగ్వేజ్
ఈ డ్రగ్స్ అమ్మకంలో కృష్ణంరాజు తన వివరాలు ఎక్కడా కూడా బయటపడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. డ్రగ్స్ అమ్మేందుకు కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తాడు. తాను ఉన్న ప్రదేశంలో వైఫై కనెక్ట్ చేసుకొని వాట్సప్ ద్వారా కస్టమర్ల నుండి డ్రగ్స్ ఆర్డర్ తీసుకుంటాడు. కస్టమర్ల నుండి బెంగుళూరులో ఉండే తన ఫ్రెండ్స్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయిస్తాడు.
ఆ తర్వాత డెడ్ డ్రాప్ అనే కోడ్ తో ఒక ప్రదేశంలో డ్రగ్స్ పెట్టి అక్కడి లొకేషన్‌ను కస్టమర్‌కు వాట్సప్‌లో పంపిస్తాడు. డ్రగ్స్ డెలివరీ అయ్యాక తన ఫ్రెండ్స్ అకౌంట్ నుండి డబ్బులను తన అకౌంట్‌కు పంపించుకుంటాడు. ఈ డ్రగ్స్‌ను బెంగళూరుకు చెందిన తేజస్ అనే స్నేహితుడి ద్వారా బెంగళూరులోని ఒక పెడ్లర్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేయించి బెంగళూరు నుండి హైదరాబాద్‌కు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో తెప్పిస్తున్నాడు.
కృష్ణంరాజు నుండి వెస్ట్ గోదావరి జిల్లాకు చెంది నగరంలోని కేపిహెచ్బీలో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసే తన ఫ్రెండ్ చిరంజీవి వర్మ కొకైన్ కొనుగోలు చేసి తన స్నేహితులకు అమ్ముతున్నాడు. దీంతో పాటు కొకైన్ కావాల్సిన వ్యక్తుల ఫోన్ నెంబర్లను కృష్ణంరాజుకు పంపిస్తుండేవాడు. విజయవాడకు చెందిన కృష్ణంరాజు బంధువు రుద్రరాజు హేమంత్‌రాజు(37) కూడా ఇటీవల డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభించాడు.
వీరు ముగ్గురు కొండాపూర్‌లోని వెంకటరమణ రెసిడెన్సీలో డ్రగ్స్ అమ్మకం చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఈగల్ టీం గచ్చిబౌలి పోలీసులతో కలిసి వీరి ఇంటిపై రైడ్ చేశాడు. ఇంట్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న రూ. 40 లక్షల విలువైన 32 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా పాజిటీవ్ వచ్చింది.
కృష్ణంరాజు నుండి కొకైన్ కొనుగోలు చేసిన వర్మ, శ్రీరాంతో సహా 15 మందిని పోలీసులు గుర్తించారు. వీరితో పాటు బెంగుళూరు నుండి హైదరాబాద్‌కు డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసిన జబ్బర్ బస్ డ్రైవర్, బస్సు డ్రైవర్ నుండి డ్రగ్స్‌ను అందజేసిన ర్యాపిడో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఈగల్టీం తెలిపింది.
