శిల్పారామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు
1 min read

శిల్పారామంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

 

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్​లోని శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివారం కావడంతో నగరం నలుమూలల నుండి సందర్శకులు శిల్పారామంకు భారీగా తరలివచ్చారు. శిల్పారామంలోని అంపి థియేటర్​లో నిర్వహించిన కళాకారులు నృత్యాలు ఆహుతులను మైమరిపించాయి.

శ్రీ గీతికా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గురువర్యులు లక్ష్మి కృష్ణ  శిష్య బృందం మహా గణపతిమ్, శ్రీ విజ్ఞ రాజాం భజే, శివ శంభో, తిల్లాన, శివ స్తుతి, నటరాజ తాండవం, నృత్యాంజలి తిల్లాన, ఆంగికం మహా దేవా శంకర, శివోహం, కల భైరవాష్టకం, ప్రభు ప్రాణానాదం, ఆది యోగ, నటరాజ నీపాదం, నాగ స్తుతి, శివ భరణం, నటరాజ యోగేశా, చిదంబర నటనం, నాగ భూషిత, ఓం సర్వేశ్వరాయ శివ హారతి మొదలైన అంశాలను సాత్విక, స్ఫూర్తి, శ్రీ శాన్వి, దుర్గ ప్రసన్న, లోకాంక్ష, తనిష్క, సంకీర్తన, చైత్రిక,అద్విత, అనన్య, లక్ష్మి సహస్ర, అక్షిత, శ్రీ వార్షిత, అక్షయ, కీర్తన ఈషాతో పాటు 150 మంది కళాకారులూ పాల్గొన్నారు.