ఆదరహో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా
1 min read

ఆదరహో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా

ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా హైదరాబాద్​కి తిరిగి వచ్చేసింది. మాదాపూర్​ శిల్పారామంలో ఒడిశా ఫుడ్​ అండ్​ క్రాఫ్ట్​ మేళా ఘనంగా ప్రారంభమైంది.

 

ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, వంటకాలు, జానపద నృత్యాలు, శాస్ర్తీయ ప్రదర్శనలతో కనువిందు చేయనున్నాయి.

ఒడిశా ప్రత్యేక వంటకాలు రుచి చూస్తున్న సందర్శకురాలు

మేళాను శిల్పారామం స్పెషల్​ అఫీసర్​ జి. కిషన్​రావు, ఎన్​ఎండీసీ మాజీ డైరెక్టర్​ డి.కె. మహంతి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు.

స్టాల్స్​లో ఆకట్టుకుంటున్న ఒడిశా హస్తకళ ఉత్పత్తులు

మేళా సందర్భంగా నృత్యపురి డాన్స్​ అకాడమీ ప్రదర్శించిన ఒడిశి, సంబల్పురి నృత్యాలు ఆకట్టుకున్నాయి. సుచీ గ్రూప్​ ప్రదర్శించిన జానపద నృత్యాలు, స్టార్​ సింగర్​ ఈశ్వరి బెహేరా గానం, బనిశ్రీ కళానికేతన్​ ప్రదర్శించిన గిరిజన నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.