క్రీడలతో మానసిక ఉల్లాసం కల్గుతుంది.. గచ్చిబౌలి కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డి
1 min read

క్రీడలతో మానసిక ఉల్లాసం కల్గుతుంది.. గచ్చిబౌలి కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డి

 

క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, శారీరక ధృడత్వం పెరుగుతుందని గచ్చిబౌలి డివిజన్​ కార్పొరేటర్​ గంగాధర్​రెడ్డి అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి లోని మంజీర డైమండ్ హైట్స్ గేట్ కమ్యూనిటీలో నిర్వహించిన “మంజీర ప్రీమియర్ లీగ్” కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లీగ్ ను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా గంగాధర్​రెడ్డి మాట్లాడుతూ…క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చన్నారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు సమాజంలో స్నేహభావం, ఐక్యతను పెంచడంతో పాటు యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ప్రతి కమ్యూనిటీలో ఇలాంటి క్రీడా వేదికలు ఏర్పాటుచేసి, క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంజీర డైమండ్ హైట్స్ కమ్యూనిటీ వాసులు ఇలాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. క్రీడలను ప్రోత్సహించేందుకు తన వంతుగా 50 వేల నగదు, 50 వేల విలువగల స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. ఈ పోటీలో సీనియర్ సిటిజన్స్ జట్లు కూడా పాల్గొనడం విశేషమన్నారు.

 

ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు శివ సింగ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, మంజీర డైమండ్ హైట్స్ గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షులు ప్రసాద్, ఉపాధ్యక్షులు అనుషుమన్ మిశ్రా, సెక్రెటరీ శ్యామ్ ప్రధాన్, ట్రెజరర్ శ్రీనివాస్ రావు, ఎంసీ మెంబర్స్ అంకుర్, జ్ఞానేశ్వర్, సోమేశ్ మిశ్రా, పిల్లలు, పెద్దలు, సీనియర్ సిటిజన్స్, గేటెడ్ కమ్యూనిటీ వాసులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.