శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ ఇంచార్జ్​ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​.. కేటీఆర్​ను కలిసింది అందుకేనా..
1 min read

శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ ఇంచార్జ్​ రేసులో గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​.. కేటీఆర్​ను కలిసింది అందుకేనా..

 

హైదరాబాద్ నగరంలో అతిపెద్ద  నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఈ నియోజకవర్గం నుండి బీఆర్​ఎస్​ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీ కాంగ్రెస్​ పార్టీలో జాయిన్​ అయ్యారు. అప్పటి నుండి శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ పార్టీకి  గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్​ కొమిరిశెట్టి సాయిబాబా పెద్ద దిక్కుగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న సాయిబాబా ప్రస్తుతం శేరిలింగంపల్లిలో బీఆర్​ఎస్​ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్​ రేసులో సాయిబాబా ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో గురువారం బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ను స్థానిక బీఆర్​ఎస్​ నాయకులతో కలిసి నందినగర్​లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాల గురించి కేటీఆర్​తో చర్చించారు. కేటీఆర్​ను కలిసిన వారిలో బోయిన్​​పల్లి కార్పొరేటర్​ నర్సింహయాదవ్​, ఇతర బీఆర్​ఎస్​ నాయకులు ఉన్నారు.