ది రాజాసాబ్.. మరో పాట వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే ?
రెబల్ స్టార్ ప్రభాస్ హిరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ హార్రర్ సినిమా ది రాజాసాబ్ సినిమాలో నుండి మరో పాట త్వరలోనే ప్రేక్షకులను ఆలరించేందుకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఈ సనిమా నుండి బయటకు వచ్చిన రెబల్ సాబ్ సాంగ్ ఆకట్టుకోగా, తాజాగా సహానా.. సహానా అంటూ మొదలయ్యే సాంగ్ ప్రోమోను మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ సాంగ్ మొత్తాన్ని డిసెంబర్ 17వ తేదిన సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమా 2026 జనవరి 9వ తేదిన విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. పాన్ ఇండియా హిరో, రెబల్ స్టార్ ప్రభాస్ హిరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హార్రర్ మూవీ రాజాసాబ్పై భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి తర్వాత సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్, సలార్ వంటి సినిమాలు వచ్చాయి.
రాజాసాబ్ తర్వాత..
ఫౌజీ : ‘సీతా రామం’ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా చిత్రం 2025 క్రిస్మస్ సందర్భంగా (డిసెంబర్ 25, 2025) విడుదలయ్యే అవకాశం ఉంది.
స్పిరిట్ : ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ కాప్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది. ఇది 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.
సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం : ‘సలార్’ మొదటి భాగం విజయవంతం కావడంతో, దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండవ భాగంపై పనిచేస్తున్నారు. ఇది 2026 నవంబర్ 14న విడుదల కావచ్చని తెలుస్తోంది.
కల్కి 2898 AD: ‘కల్కి 2898 AD’ మొదటి భాగం తర్వాత, ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీకి కొనసాగింపు ఉండే అవకాశం ఉంది, అయితే దీని విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు.
