తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్​ !
1 min read

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీవీ ఆనంద్​ !

 

తెలంగాణ రాష్ర్ట నూతన డీజీపీగా సీనియర్​ ఐపిఎస్​ అధికారి సీవీ ఆనంద్​ నియమితులయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం డీజీపీగా పనిచేస్తున్న శివధర్​రెడ్డి పదవి విరమణ కాలం ఈ నెల 30తో ముగుస్తుండడంతో రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ర్టంలో పలువురు ఐపిఎస్​ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

 

ఈ బదిలీల్లో హోం శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సీవీ ఆనంద్​ స్థానంలో సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయల్​ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డీజీపీ రేసులో సీవీ ఆనంద్​,  శిఖాగోయల్​తో పాటు ఇతర అధికారులు పోటీ పడుతుండగా… ప్రభుత్వం సీవీ ఆనంద్​ వైపు మెగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కొత్త డీజీపీగా సీవీ ఆనంద్​ను ప్రకటిస్తూ ప్రభుత్వం త్వరలోనే ప్రకటన చేయబోతుందని తాజా ఐపీఎస్​ అధికారుల బదిలీల ఉత్తర్వులతో ఉహాగానాలు మొదలయ్యాయి.