శేరిలింగంపల్లి తహసీల్ధార్ బదిలీ.. నూతన తహసీల్దార్‌గా మహిపాల్‌రెడ్డి
శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్‌గా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇతనిలో పాటు తెలంగాణ రాష్ర్టంలో పలువురు డిప్యూటీ, అడిషనల్ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శేరిలింగంపల్లి నూతన ఎమ్మార్వోగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీఓగా పనిచేస్తున్న మహిపాల్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
జోగులాంబా గద్వాల జిల్లా డిఆర్ఓగా పద్మజరాణి, మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్‌గా హరిప్రియ, అదిలాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా భుజంగరావు, గద్వాల ఆర్డీఓగా టి. శ్రీనివాస్‌రావు, నర్సాపూర్ ఆర్డీఓగా పి. రామకృష్ణ, చేవెళ్ల ఆర్డీఓగా ప్రతాప్సింహారెడ్డి, ఖమ్మం ఆర్డీఓగా శ్రీనివాస్, మెట్పల్లి ఆర్డీఓగా నర్సింహారావు, నల్గొండ స్పెషల్ కలెక్టర్‌గా మాధవిదేవి, ఎల్లారెడ్డి ఆర్డీఓగా ప్రభాకర్‌గా నియామకం అయ్యారు. వీరితో పాటు పలువురు స్పెషల్ కలెక్టర్లను కూడా బదిలీ చేసింది.
