రన్నింగ్ కారులో చెలరేగిన మంటలు.. ప్రాణాలతో బయటపడ్డ ఐటీ ఉద్యోగి
అఫీస్ నుండి ఐటీ ఉద్యోగి ఇంటికి కారులో వెళ్తుండగా ఇంజిన్ నుండి పొగలు వచ్చి క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించారు. వెంటనే అప్రమత్తమైన ఐటీ ఉద్యోగి కారు నుండి బయటకు వచ్చి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన మాదాపూర్ సీసీఆర్టీ వద్ద జరిగింది.

ఇజ్జత్‌నగర్‌లో నివాసం ఉండే బి. రాఘవకృష్ణ మంగళవారం సాయంత్రం తన షిఫ్ట్ డిజైర్కారు(టీఎస్08ఎఫ్‌కె3459)లో గచ్చిబౌలిలోని అఫీస్ నుండి ఇజ్జత్‌నగర్‌లోని ఇంటికి బయలుదేరాడు. కారు మాదాపూర్ సీసీఆర్టీ వద్దకు చేరుకోగానే ఇంజిన్ నుండి పొగలు రావడం గమనించి వెంటనే కారును పక్కకు నిలిపి బయటకు వచ్చాడు. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించాయి.

సమాచారం అందుకున్న మాదాపూర్ ఫైర్ స్టేషన్ అధికారులు ఫైర్ ఇంజిన్‌తో సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదం కారణంగా కొత్తగూడ నుండి హైటెక్స్ మెటల్ చార్మినార్ సిగ్నల్ రూట్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో మాదాపూర్ ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది ఈ రూట్లోని ట్రాఫిక్ క్లియర్ చేశారు.
