హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడిండ్రు..
హెచ్‌సీయూలో ఇంటి దొంగలు..
కిటికి గ్రిల్స్ తొలగించి 50 ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లిన దొంగలు..
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ప్రవేశం లేనటువంటి పటిష్ట బందోబస్తు ఉండే హెచ్‌సీయూలో దొంగతనం జరగడం వర్సిటీలో సంచలనంగా మారింది. వర్సిటీ సీఆర్‌రావు ఇనిస్టిట్యూట్‌లో కిటికి గ్రిల్స్ తొలగించి 50 ల్యాప్‌టాప్‌లు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హెచ్‌సీయూలో సీఆర్‌రావు ఇనిస్టిట్యూట్ క్లాస్‌రూంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు కిటికి గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించి క్లాస్‌రూంలో ఉన్న ల్యాప్‌టాప్‌లను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం క్లాస్‌రూంలో ల్యాప్‌టాప్‌లు కనిపించకపోవడంతో వర్సిటీ మేనేజ్మెంట్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు క్లాస్‌రూం కిటికి గ్రిల్స్ తొలగించి ఉండడం, కారు టైర్ల గుర్తులు ఉన్నట్లు గుర్తించారు.
దీంతో పోలీసులు వర్సిటీలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సీఆర్‌రావు ఇనిస్టిట్యూట్లోనే పెద్ద ఎత్తున ల్యాప్‌టాప్‌లు ఉన్న విషయం వర్సిటీలో తెలిపిన వ్యక్తులకే సమాచారం ఉంటుందని, ఇది ఇంటి దొంగలే పనే అయ్యుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చోరికి గురైన 50 ల్యాప్‌టాప్‌లు శుక్రవారమే తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇంతలోనే చోరీ గురవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
