టౌన్ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగంపైనే ఫిర్యాదులు వచ్చాయి. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
మొత్తం 24 ఫిర్యాదులు రాగా అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి16, ఇంజనీరింగ్ విభాగానికి 5, యూబీడీ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి రెండు ఫిర్యాదులు అందాయి. సర్కిల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండడంతో స్థానికులు పెద్ద ఎత్తున వాటిపై ఫిర్యాదులు అందజేశారు.
వీటిని స్వీకరించిన డీసీ ఆయా విభాగాల అధికారులను వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఏఎంసీ బిక్షపతి, ఏసీపీ రాణి, డీఈ వశిధర్, ఏఎంఓహెచ్ శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఎస్ శ్రీనివాస్ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
