శిల్పారామంలో సందడిగా సాగుతున్న గాంధీ శిల్ప బజార్
మాదాపూర్ శిల్పారామంలో చత్తీస్ఘర్ గాంధీ శిల్ప బజార్ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా ఆకట్టుకుంటుంది. శనివారం వీకెండ్ కావడంతో మేళాకు నగరం నలుమూలల నుండి సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో శనివారం ప్రియాంక, వేముల రాధికా శిష్య బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శించి మెప్పించారు.

ప్రియాంక శిష్య బృందంలోని సింధు, శాన్వి, సాక్షి, శ్రీజ, అమేయ, మీను అనన్యలు పుష్పాంజలి, శ్రీ గణపతిని, మూషిక, దేవి నీయతున్నాయి, రామ కోదండ రామ , గంధము పూయరుగా, తులసీదళములతో రామచంద్రయ్య అంశాలను ప్రదర్శించారు. వేముల రాధికా శిష్య బృందంలోని కృతిక, అనైనా, సాన్విక, కాత్యాయని, సహస్ర, అద్వికాలు విగ్నేశ్వర కీర్తన.భామాకలాపం, శరణు సిద్ధి, దశావతర తరంగం, మామవతు శ్రీ సరస్వతి, శివ పంచాక్షరీ, శివ తరంగం, రామాయణ శబ్దం ప్రదర్శించి మెప్పించారు.

