శేరిలింగంపల్లి ప్రజలపై వెంకటేశ్వర స్వామి అశీస్సులుండాలి.. ఎమ్మెల్యే గాంధీ
1 min read

శేరిలింగంపల్లి ప్రజలపై వెంకటేశ్వర స్వామి అశీస్సులుండాలి.. ఎమ్మెల్యే గాంధీ

 

వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో శేరిలింగంపల్లి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉండాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ అరెకపూడి గాంధీ అకాంక్షించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఏక వింశ:(21 వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య తిరుకళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ పాల్గొని కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, దేవాలయం ఈఓ సత్యనారాయణ, భక్తులతో కలిసి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందచేయడం చాలా సంతోషంగా ఉందని, వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మోహన్ ముదిరాజు, గంగాధర్, బాలు, ఉత్సవ కమిటీ సభ్యులు రాజు, శ్రీ హరి, అప్పిరెడ్డి, సాంబ శివ రెడ్డి, కుమార స్వామి, కడియాల శివ, సుజాత, సుబ్రమణ్యం, నరేష్, వెంకట నారాయణ, సత్యనారాయణ రావు,రాధ కృష్ణ, రామ కృష్ణ, భక్తులు పాల్గొన్నారు