శిల్పారామంలో మొదలైన గాంధీ శిల్ప బజార్
శిల్పారామం మాదాపూర్ లో చత్తీస్ఘడ్ హస్తశిల్ప వికాస్ బోర్డు, డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ సౌజన్యంతో శిల్పారామం ఆవరణ లో “గాంధీ శిల్ప బజార్” హస్తకళా మేళ శుక్రవారం ప్రారంభమైంది. చత్తీస్ఘడ్ నుండి విచ్చేసిన హస్తకళాకారులు మెటల్ ఆర్ట్ , మెటల్ జ్యువలరీ, జ్యూట్ క్రాఫ్ట్ , గోండ్ పెయింటింగ్, గోండ్ పెయింటింగ్డ్స్ స్టోల్స్, డ్రెస్ మెటీరియల్స్, క్రాఫ్ట్, సిసెల్ క్రాఫ్ట్ , బస్తర్ ఢోక్ర క్రాఫ్ట్, బస్తర్ వుడ్ కార్వింగ్, వెదురు బొంగు తో తయారు చేసిన వస్తువులు మరి ఎన్నో ఆకర్షణీయమైన గృహ అలంకరణ వస్తువులు స్టాల్స్‌లలో ఆకట్టుకుంటున్నాయి.
సాయంత్రం హంపి థియేటర్లో కుమారి రమ్య మౌనిక, వెంకట లక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. చక్కని తలికి, మూషిక వాహన, నారాయణతే, స్వాగతం, మహాగణపతిమ్ ,ముద్దుగారే యశోద మొదలైన అంశాలను కళాకారులూ లేక, అధ్య, భక్తి, అనన్య, యువశ్రీ, దివంశీ, చరిష్మా మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.
