Andhra Pradesh
cinema
Gallery
National
ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో చీప్ లిక్కర్ పోసి అమ్ముతుండ్రు.. ఎక్కడంటే
మద్యం ప్రియులకు ఎప్పటికైనా ఫారిన్ లిక్కర్‌ను ఒక్కసారి అయినా తాగాలని ఉంటుంది. కానీ వాటి ధరను చూసి ఆ మందును తాగేందుకు మొగ్గుచూపరు. కానీ తక్కువ ధరకే ఫారిన్ లిక్కర్ దొరుకుతే మందుబాబులకు పండుగే. ఈ అవకాశాన్ని ఐదుగురు వ్యక్తులు తమ ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. ఖాళీ ఫారిన్ లిక్కర్ బాటిళ్లలో బాటిళ్లలో చీప్ లిక్కర్ మందు పోసి ఫేక్ ఫారిన్ లిక్కర్ మందు అమ్ముతున్నారు. ఇలా ఫేక్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అమ్ముతున్న […]
మా భూములపై కన్నెస్తే ఖబర్ధార్… ప్రభుత్వంపై మనూ విద్యార్ధులు ఆగ్రహం
వర్సిటీకి కేటాయించిన భూముల్లో 50 ఎకరాలు వెనక్కి తీసుకోవడంపై ఆందోళన మనూలో నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు.. గచ్చిబౌలి లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన భూముల్లో 50 ఎకరాలను వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై బుధవారం విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఉర్దూ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రధాన గేట్ వద్దకు ర్యాలీగా తరలివచ్చారు. ఉర్దూ యూనివర్సిటీ ప్రభుత్వ జాగీరు కాదని, యూనివర్సిటీ భూమిపై […]
శేరిలింగంపల్లి సర్కిల్ ఏసీపీ వెంకటరమణపై చర్యలు తీసుకోండి
ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేత మిద్దెల మల్లారెడ్డి శేరిలింగపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకటరమణపై అవినీతి అరోపణలు వచ్చిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను నిలదీశారు. ఏసీపీ వెంకటరమణ, చైన్‌మెన్ మోహన్‌పై చర్యలు తీసుకోవాలని సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో అక్రమ […]
ఈత… కావద్దు కన్న వారికి కడుపు కోత..
స్విమ్మింగ్ ఫూల్ ప్రమాదాల్లో మృతి చెందుతున్న చిన్నారులు.. కన్నవారికి కడుపుశోకం.. జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న పోలీసులు.. ఇటీవల కాలంలో చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లలో పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్న విషాదకర ఘటనలు కలచివేస్తున్నాయి. చిన్న నిర్లక్ష్యం కారణంగా కన్నవారికి కడుపు కొత్త మిగిలిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, అపార్ట్మెంట్ ప్రాంగణాల్లో తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, పూల్ పర్యవేక్షణలో లోపించడం వంటి అంశాలు ఈ ఘటనలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. […]
రూ. 35 కోట్ల విలువైన 3 వేల గజాల పార్కు స్థలాన్ని రక్షించిన హైడ్రా
3 వేల గజాల పార్కు స్థలాలను కాపాడిన హైడ్రా — రూ. 35 కోట్ల విలువైన స్థలాల చుట్టూ ఫెన్సింగ్ కూకట్‌పల్లి పరిధిలోని 3 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న రెండు పార్కులను హైడ్రా శనివారం కాపాడింది. ఇలా కాపాడిన భూమి విలువ రూ. 35 కోట్ల వరకూ ఉంటుంది. భాగ్యనగర్ ఫేజ్–3 కాలనీలో రెండు పార్కులు కబ్జాకు గరయ్యాయని హైడ్రా ప్రజావాణికి అక్కడి నివాసితుల సంక్షేమ సంఘం ఫిర్యాదు చేసింది. హైడ్రా కమిషనర్ […]
మారిన సైబరాబాద్ పోలీసుల ఫోన్ నెంబర్లు .. కొత్త నెంబర్లు ఇవే..
సైబరాబాద్ పోలీస్ కమిషరేట్‌లోని పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లు మారాయి. సైబరాబాద్ సీపీతో పాటు ఇతర ఉన్నతాధికారుల పాత ఫోన్ నెంబర్ల స్థానంలో కొత్త ఫోన్ నెంబర్‌లు వచ్చాయి. పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నెంబర్లు ఇతర సిరీస్ ల నుంచి గత కొద్ది కాలంగా ఇతర పోలీస్ యూనిట్లు వాడుతున్న 87126 సిరీస్ కు మారుతున్నారు. గతంలో పోలీస్ అధికారుల వద్ద ఉన్న పాత అధికారిక నెంబర్లు ఇక పై పనిచేయవనే విషయాన్ని […]
జన నాయకుడు సినిమా ట్రైలర్ వచ్చేసింది..
తమిళ నటుడు విజయ్ హిరోగా హెచ్. వినోద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘‘జన నాయగన్” సినిమా తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం జన నాయకుడి ట్రైలర్ వీడియో ట్రెండ్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతకంపై వెంకట్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజహెగ్డే […]
హెచ్‌సీయూ అడవి నుండి బయటకొచ్చిన జింక.. కారు ఢీకొట్టడంతో మృతి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో నుండి ఓ జింక దారి తప్పి గచ్చిబౌలి లింగంపల్లి పాత జాతీయ రహదారిపైకి వచ్చింది. ఇదే సమయంలో అటూగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ జింక చికిత్స పొందుతూ మృతి చెందింది. శనివారం ఉదయం హెచ్‌సీయూ అటవీ ప్రాంతం నుండి జింక తప్పిపోయి గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిలోని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ అఫీస్ సమీపంలో అలిండ్ కంపెనీ ప్రహారీ గోడ […]
సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. దొంగలొస్తున్నారు జాగ్రత్త !
విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు కాలనీల్లో, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అనుమానితులు కనిపిస్తే సమాచారం అందించాలి అప్రమత్తంగా ఉండాలన్న సైబరాబాద్ పోలీసులు మరో పది రోజుల్లో సంక్రాంతి పండుగ. రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలకు సంక్రాంతి పెద్ద పండుగ. ఇప్పటికే రాష్ర్ట ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సెలవులను ప్రకటించింది. సిటీ ప్రజలు కూడా పండుగకు ఊరికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. బస్సులు, ట్రైన్లు, సొంత వాహనాల్లో ఊరికి […]
సైబరాబాద్‌లో ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 928 మంది మందుబాబులు మందు తాగి దొరికిన వారిలో బైకర్లే ఎక్కువ ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఇన్సిడెంట్ ఫ్రీ/ యాక్సిడెంట్ ఫ్రీ గా ముగిసాయి. సైబరాబాద్ పోలీసుల ముందస్తు పకడ్బందీ ప్రణాళికలు, నిరంతర నిఘా, క్షేత్రస్థాయి సమన్వయంతో అమలు చేసిన భద్రతా చర్యల ఫలితంగా నూతన […]

