క్రీడలతో మానసిక ఉల్లాసం కల్గుతుంది.. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి
క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, శారీరక ధృడత్వం పెరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి లోని మంజీర డైమండ్ హైట్స్ గేట్ కమ్యూనిటీలో నిర్వహించిన “మంజీర ప్రీమియర్ లీగ్” కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ…క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని […]
చైనా మాంజాపై పోలీసుల పంజా
కూకట్‌పల్లి పోలీసుల ప్రజా అవగాహన సమావేశం ఒక చిన్న దారం అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చైనీస్ మాంజా వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజలను చైతన్యపరిచే ఉద్దేశంతో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్, బాగ్ అమీర్ ప్రాంతాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీసులు ప్రజా అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశంలో పోలీస్ అధికారులు ప్రజలతో ముఖాముఖీగా మాట్లాడుతూ..పండగల ఆనందం పేరుతో చైనీస్ మాంజా వాడకం ప్రాణాంతకంగా మారుతోందని, ద్విచక్ర […]
హైటెక్‌సిటీలో సాఫ్ట్వేర్ ఉద్యోగి డ్రగ్స్ దందా
అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఉద్యోగం చేస్తుండగా వచ్చే జీతం సరిపోకపోవడమో లేదా సులభంగా డబ్బు సంపాధించాలనే కారణంతోనో డ్రగ్స్ విక్రయించాలని డిసైడ్ అయ్యాడు. బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకువచ్చి ఐటీ కారిడార్‌లో ఐటీ ఉద్యోగులకు అమ్మేందుకు సిద్ధమవుతుండగా పోలీసులకు చిక్కాడు. దీంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 11 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రానికి చెందిన ముత్యాల సాయికిరణ్(28) […]
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి లీగల్ నోటీసులు.. ఎవరు పంపారంటే ?
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పరువుకు నష్టం కలిగించారని బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు లీగల్ నోటీసులు పంపించారు. బండి సంజయ్‌తో పాటు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్‌కు కూడా లీగల్ నోటీసులు పంపించారు. తనపై, తన కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బండి సంజయ్, ఎంపి అర్వింద్‌కు వేరువేరుగా లీగల్ నోటీసులు పంపించారు. […]
శిల్పారామంలో సందడిగా సాగుతున్న గాంధీ శిల్ప బజార్
మాదాపూర్ శిల్పారామంలో చత్తీస్‌ఘర్ గాంధీ శిల్ప బజార్ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా ఆకట్టుకుంటుంది. శనివారం వీకెండ్ కావడంతో మేళాకు నగరం నలుమూలల నుండి సందర్శకులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో శనివారం ప్రియాంక, వేముల రాధికా శిష్య బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శించి మెప్పించారు. ప్రియాంక శిష్య బృందంలోని సింధు, శాన్వి, సాక్షి, శ్రీజ, అమేయ, మీను అనన్యలు పుష్పాంజలి, శ్రీ గణపతిని, మూషిక, దేవి నీయతున్నాయి, రామ కోదండ రామ […]
కళాభిమానులను ఆకర్షిస్తున్న హైదరాబాద్.. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ రమణారెడ్డి
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన హైదరాబాద్ పెరల్స్ ఆర్ట్ క్యాంప్ హైదరాబాద్ మహా నగరం కళాభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుందని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం.వి రమణారెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ శనివారం 40 మంది కళాకారులతో ‘హైదరాబాద్ పెరల్స్ -I పేరుతో ఆర్ట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కళా శిబిరాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు అండ్ ఆర్ట్ క్యాంపు క్యూరేటర్ ప్రముఖ శిల్పి ఎంవి రమణా రెడ్డి […]
కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను డ్రైవ్ చేయండి.. సైబరాబాద్ సీపీ రమేష్
ఇంటికి క్షేమంగా చేరడమే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం సైబరాబాద్‌లో అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమాలు రోడ్డు ప్రమాదాలు అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని, ఎంతో మంది ఆప్తులను కొల్పోతున్నారని, ఈ ప్రమాదాలను తగ్గించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ తెలిపారు. మానవ ప్రాణం అమూల్యమైనదని, ప్రతీఒక్కరూ తమ ప్రాణాలతో పాటు తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు […]
శేరిలింగంపల్లి ప్రజలపై వెంకటేశ్వర స్వామి అశీస్సులుండాలి.. ఎమ్మెల్యే గాంధీ
వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో శేరిలింగంపల్లి ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉండాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, పిఏసి చైర్మన్ అరెకపూడి గాంధీ అకాంక్షించారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఏక వింశ:(21 వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శుక్రవారం […]
శిల్పారామంలో మొదలైన గాంధీ శిల్ప బజార్
శిల్పారామం మాదాపూర్ లో చత్తీస్ఘడ్ హస్తశిల్ప వికాస్ బోర్డు, డెవలప్మెంట్ కమీషనర్ హ్యాండీక్రాఫ్ట్స్ సౌజన్యంతో శిల్పారామం ఆవరణ లో “గాంధీ శిల్ప బజార్” హస్తకళా మేళ శుక్రవారం ప్రారంభమైంది. చత్తీస్ఘడ్ నుండి విచ్చేసిన హస్తకళాకారులు మెటల్ ఆర్ట్ , మెటల్ జ్యువలరీ, జ్యూట్ క్రాఫ్ట్ , గోండ్ పెయింటింగ్, గోండ్ పెయింటింగ్డ్స్ స్టోల్స్, డ్రెస్ మెటీరియల్స్, క్రాఫ్ట్, సిసెల్ క్రాఫ్ట్ , బస్తర్ ఢోక్ర క్రాఫ్ట్, బస్తర్ వుడ్ కార్వింగ్, వెదురు బొంగు తో తయారు […]
ఐటీ కారిడార్‌లో కబ్జాదారుల చెర నుండి 2500 గజాల పార్కు స్థలం సేఫ్
హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలను తొలగించింది. గచ్చబౌలి ప్రాంతంలో పార్కును కాపాడగా.. శామీర్‌పేటలో రోడ్డు ఆక్రమణలను తొలగించి అక్కడి నివాసితులకు దారి చూపింది. ఈ రెండు ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గజాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500ల గజాల వరకూ ఆక్రమణలు జరిగిపోయాయి. […]
