Telangana
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దొంగలు పడిండ్రు..
హెచ్‌సీయూలో ఇంటి దొంగలు.. కిటికి గ్రిల్స్ తొలగించి 50 ల్యాప్‌ట్యాప్‌లు ఎత్తుకెళ్లిన దొంగలు.. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంటర్ యూనివర్సిటీలో దొంగలు పడ్డారు. సెక్యూరిటీ అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు ప్రవేశం లేనటువంటి పటిష్ట బందోబస్తు ఉండే హెచ్‌సీయూలో దొంగతనం జరగడం వర్సిటీలో సంచలనంగా మారింది. వర్సిటీ సీఆర్‌రావు ఇనిస్టిట్యూట్‌లో కిటికి గ్రిల్స్ తొలగించి 50 ల్యాప్‌టాప్‌లు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హెచ్‌సీయూలో సీఆర్‌రావు […]
నార్సింగ్ చౌరస్తాలో పార్కును కాపాడిన హైడ్రా
మూడు వేల గజాల పార్కు చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ కబ్జాకు గురైన 60 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. కబ్జాదారుల చెర నుండి పార్కును రక్షించి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. గండిపేట మండలంలోని నార్సింగ్ విలేజ్ నార్సింగ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాయానికి చేరువులో అరుణోదయ కాలనీ హుడా అనుమతి పొందిన లే ఔట్లో 6078 గజాలు పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న […]
ఉన్నత చదువులు చదివేందుకు పేద విద్యార్థికి హెల్ప్ చేసిన లయన్స్ క్లబ్
ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదివేందుకు ఆ విద్యార్థికి అవకాశం వచ్చింది. కానీ అంత దూరం వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఆ పేద విద్యార్థికి ఆర్థిక చేయూతనందించేందుకు లయన్స్ క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కే పి వివేకానంద చేతుల మీదుగా సోమవారం ఆ విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేశారు. సూరారం కాలనీ 60 గజాలకి చెందిన శ్రీపతి ఉదయ్ కుమార్‌కు ఆస్ట్రేలియాలో మైక్రో బయాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవకాశం వచ్చింది. […]
టౌన్ ప్లానింగ్‌పైనే ఎక్కువ ఫిర్యాదులు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మియాపూర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ విభాగంపైనే ఫిర్యాదులు వచ్చాయి. సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 24 ఫిర్యాదులు రాగా అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి16, ఇంజనీరింగ్ విభాగానికి 5, యూబీడీ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి రెండు ఫిర్యాదులు అందాయి. సర్కిల్ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండడంతో స్థానికులు పెద్ద ఎత్తున వాటిపై ఫిర్యాదులు […]
అట్టహాసంగా ముగిసిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా..
మాదాపూర్ శిల్పారామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఆదివారం సందడిగా ముగిసింది. ఈ మేళాలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కళలు, హస్తకళలు, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ మేళాలో ఒడిశాకు ప్రత్యేకమైన హస్తకళలు, హ్యాండ్లూమ్స్‌తో 30కిపైగా క్రాఫ్ట్ స్టాల్స్ అలాగే సంప్రదాయ ఒడియా వంటకాలను అందించిన 20 ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యపురి డాన్స్ […]
ఆదరహో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా హైదరాబాద్‌కి తిరిగి వచ్చేసింది. మాదాపూర్ శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, వంటకాలు, జానపద నృత్యాలు, శాస్ర్తీయ ప్రదర్శనలతో కనువిందు చేయనున్నాయి. మేళాను శిల్పారామం స్పెషల్ అఫీసర్ జి. కిషన్‌రావు, ఎన్ఎండీసీ మాజీ డైరెక్టర్ డి.కె. మహంతి ముఖ్య అతిధులుగా హాజరై […]
అప్పులు తీర్చేందుకు చైన్‌స్నాచింగ్ అవతారం… 24 గంటల్లోనే పోలీసులకు దొరికిపోయిండు
అప్పలు తీర్చేందుకు ఓ యువకుడు చైన్ స్నాచర్‌గా మారాడు. గుడి నుండి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడి 24 గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కాడు. ఈ సంఘటన బీహెచ్ఈఎల్ ఓల్డ్ ఎంఐజీలో చోటుచేసుకుంది. ఓల్డ్ ఎంఐజీలో నివాసం ఉండే పొట్లపల్లి సత్యవతి(72) గత నెల 31వ తేదిన ఉదయం కిలోమీటర్ దూరంలో ఉన్న రామాలయం దేవాలయానికి వెళ్లి, అక్కడ భోజనాలు చేసి తిరిగి సమయంలో ఎదురుగా వచ్చిన ఓ […]
కళలు, సంప్రదాయ సాంస్కృతిక సందడిగా సాగిన నైమిషం ఎర్త్ ఫెస్టివల్
ఎర్త్ ని మించిన వెల్త్ లేదని చాటిన ఎర్త్ ఫెస్టివల్ ఆకట్టుకున్న సాంస్కృతిక హస్తకళలు పర్యావరణ హితమే అందరి అభిమతం కావాలని, అదే భవిష్యత్ లో మానవాళి కి మేలు చేస్తుందని భిన్న రంగాల ప్రముఖులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ అఫ్ ఇండియాలో జె కృష్ణమూర్తి హైదరాబాద్ సెంటర్, టీమ్ రేట్రో ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నైమిషం ఎర్త్ ఫెస్టివల్ 3వ ఎడిషన్ నిర్వహించారు. ఈ పర్యావరణ ఉత్సవంలో […]
ఇంటికి వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో బంగారం ఎత్తుకెళ్లిన చైన్‌స్నాచర్
బంగారం ధర పెరగడంతో రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు శనివారం ఇద్దరు మహిళల మెడలో 13 లక్షల 8 తులాల బంగారం లాక్కెళ్లిన స్నాచర్ బంగారం ధర అకాశాన్ని తాకుతుండడంతో ఇదే అదునుగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్‌గా స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం గుడిలో అన్నదానానికి వెళ్లి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల మెడలో నుండి ఎదురుగా వచ్చిన ఓ వ్యక్తి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఈ సంఘటనతో […]
క్రీడలతో మానసిక ఉల్లాసం కల్గుతుంది.. గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి
క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని, శారీరక ధృడత్వం పెరుగుతుందని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి అన్నారు. గురువారం గచ్చిబౌలి డివిజన్ పరిధి గోపనపల్లి లోని మంజీర డైమండ్ హైట్స్ గేట్ కమ్యూనిటీలో నిర్వహించిన “మంజీర ప్రీమియర్ లీగ్” కార్యక్రమానికి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై లీగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ…క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవనశైలికి దోహదపడతాయని […]
