మూడు నెలల క్రితమే లవ్​ మ్యారేజ్​.. నూతన సంవత్సరం రోజే సూసైడ్​ చేసుకున్న భర్త
1 min read

మూడు నెలల క్రితమే లవ్​ మ్యారేజ్​.. నూతన సంవత్సరం రోజే సూసైడ్​ చేసుకున్న భర్త

 

నూతన సంవత్సరం రోజున ప్రేమించి పెండ్లి చేసుకున్న ఓ జంట ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే ప్రేమ పెండ్లి చేసుకున్న యువతి, యువకుడు.. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ కారణంగా క్షణికావేశం కారణంగా భర్త సూసైడ్​ చేసుకున్నాడు. న్యూయర్​ వేళ తనతో టైమ్​ స్పెండ్​ చేస్తాడనుకుంటే.. ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్​తో కలిసి అర్దరాత్రి వరకు మద్యం తాగి ఎంజాయ్​ చేసి ఇంటికి వచ్చాడు. అప్పటికే కోపంతో ఉన్న భార్య.. మందు తాగి ఎందుకు ఇంటికి వచ్చావ్​ అంటూ గొడవ పడింది. గొడవ సద్ధుమణిగాక ఇద్దరూ నిద్రపోయారు. తెల్లారి చూసేసరికి బాత్రూంలో ఆ భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన గచ్చిబౌలి పోలీస్​ స్టేషన్​ లిమిట్స్​లో జరిగింది.

 

కొండాపూర్​ శ్రీరాంనగర్​ ఏ బ్లాక్​కు చెందిన కుంచర్ల మల్లికార్జున(30) స్థానికంగా టీ షాప్​ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. మల్లికార్జున 2025 సెప్టెంబర్​లో కావ్యను లవ్​ మ్యారేజ్​ చేసుకొని తల్లిదండ్రులు, సోదరితో కలిసి ఉంటున్నాడు. బుధవారం 31వ తేది కావడంతో మల్లికార్జున్​ ఫ్రెండ్స్​తో కలిసి మద్యం తాగి ఎంజాయ్​ చేసి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి చేరుకున్నాడు. కొత్తగా పెండ్లి అయ్యాక వచ్చిన న్యూఇయర్​ కావడం, తనతో కలిసి న్యూఇయర్​ ఎంజాయ్​ చేస్తాడనుకుంటే తన భర్త ఫ్రెండ్స్​తో కలిసి ఎంజాయ్​ చేసి రావడంతో మల్లికార్జున భార్య కావ్య అప్పటికే కోపంతో రగిలిపోతుంది.

 

దీంతో మద్యం ఎందుకు తాగి వచ్చావ్​ అంటూ భర్త మల్లికార్జున్​తో గొడవ పడింది. కొద్దిసేపటికి సర్దుమణిగాక ఇద్దరూ కలిసి తమ గదిలో నిద్రపోయారు. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ శుక్రవారం ఉదయం11.30 గంటల సమయంలో  మల్లికార్జున్​ సోదరి మమత స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లగా డోర్​ లోపలికి నుండి గడియ పెట్టి ఉంది. డోర్​ కొట్టిన తీయకపోవడంతో ఇంటి పక్కనే ఉన్న పిన్ని సహాయంతో బాత్రూం  డోర్​ను పగులగొట్టి చూడగా బాత్రూంలో మల్లికార్జున్ చున్నీతో ఉరివేసుకొని కనిపించాడు. దీంతో ఇద్దరు కలిసి స్థానికుల సహాయంతో మల్లికార్జునను బాత్రూం నుండి బయటకు తీసుకువచ్చి చూసే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే మద్యం మత్తులో ఉన్న మల్లికార్జున భార్య తిట్టడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పారు.