ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​
1 min read

ఐటీ కారిడార్​లో డ్రగ్స్​ పట్టివేత.. అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​

ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు, ఇద్దరు డ్రగ్స్​ వినియోగదారులు అరెస్ట్​

 

పట్టుబడ్డ వారిలో ఇద్దరు స్టూడెంట్స్​

 

కొకైన్​, మ్యాజిక్​ మష్రూమ్​, హషీష్​కేక్​, ఎండిఎంఏ, ఎల్​ఎస్​డి స్టాంప్​ పేపర్లు ​ స్వాధీనం

 

ఐటీ ఉద్యోగులు, విద్యార్ధులే లక్ష్యంగా అడ్డదారిలో నగరానికి డ్రగ్​ పెడ్లర్లు డ్రగ్స్​ను తీసుకువచ్చి భారీ మొత్తానికి అమ్ముతున్నారు. శనివారం మియాపూర్​లో పోలీసులు  డ్రగ్స్​ పట్టివేశారు. గోవా నుండి హైదరాబాద్​కు బస్సులో డ్రగ్స్​ తీసుకువచ్చి విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు ఓ ఇంటిపై రైడ్​ చేసి డ్రగ్స్​ అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులు, కొనుగోలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 1.98 లక్షల విలువైన కొకైన్​, హాషిష్​ కేక్​, చరస్​, ఎండిఎంఏ, ఎల్​ఎస్​డి స్టాంప్​ పేపర్లు, మ్యాజిక్​ మష్రూమ్​లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్​, సెల్​ఫోన్లు, క్యాష్

వీరిని మియాపూర్​ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్​ జిల్లా దమ్మాయిగూడ సిద్ధార్థనగర్​కాలనీలో నివాసం ఉండే అర్లికట్టే రాజేష్​ అనిరుధ్​(27) గ్రాఫిక్​ డిజైనర్​గా పనిచేస్తూ మత్తు కోసం డ్రగ్స్​ తీసుకునే వాడు. ఆ తర్వాత డ్రగ్స్​ను అమ్ముకమే జీవనాధారం చేసుకున్నాడు. హబ్సిగూడ స్ర్టీట్​ నెం.8లోని హైమావతి అపార్ట్​మెంట్​లో నివాసం ఉండే సూర్యదేవర సుమంత్​(24) ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటూ డ్రగ్స్​కు అలవాటు పడి డ్రగ్స్​ పెడ్లర్​గా మారాడు. రాజేష్​ గోవాకి వెళ్లి డ్రగ్స్​ కొనుగోలు చేసి బస్సు ద్వారా శనివారం మియాపూర్​కు చేరుకున్నాడు. హఫీజ్​పేట్​ ప్రేమ్​నగర్​లోని ఓ ఇంట్లో డ్రగ్స్​ అమ్మకం జరుగుతుందని సమాచారం అందుకున్న​ మాదాపూర్​ ఎస్​ఓటీ పోలీసులు ప్రేమ్​నగర్​లోని ఇంటిపై రైడ్ చేశారు.

 

ఆ ఇంటిలో డ్రగ్స్​ అమ్ముతున్న రాజేష్​, సుమంత్​తో పాటు సబ్​ పెడ్లర్లు మియాపూర్​ మదీనగూడకు చెందిన స్టూడెంట్​ మన్నె సాయి కిరణ్​(22), బీరంగూడ కెఎస్​ఆర్​కాలనీకి చెందిన స్కూల్​ బస్సు డ్రైవర్​ మహమ్మద్​ సబీర్​(24)లతో పాటు డ్రగ్స్​ కొనుగోలు చేసేందుకు వచ్చిన చందానగర్​ గంగారంకు చెందిన డ్రైవర్​ ముప్పి ఆకాశ్​(21), జేఎన్​టీయూ ఎస్​ఎస్​కాలనీకి ప్రాంతానికి చెందిన బుక్కూరి అభిషేక్​పాల్​(22)లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ. 1.98 లక్షల విలువైన 2.5 గ్రాముల ఎండిఎంఏ, 5 గ్రాముల చరస్​, 5 గ్రాముల హషీష్​ కేక్​, ఒక గ్రాము కొకైన్​, 10 గ్రాముల మ్యాజిక్​ మష్రూమ్​, 55 బోల్ట్​ల ఎల్​ఎస్​డి స్టాంప్​ పేర్లను స్వాధీనం చేసుకున్నారు.

 

డ్రగ్స్​ అమ్ముతున్న వారిలో ఇద్దరు స్టూడెంట్స్​..

 

అనంతరం వీరిని మియాపూర్​ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్​ పోలీసులు నిందితులను అరెస్ట్​ చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు రాజేష్​ అనిరుధ్​ గతంలో తిరుమలగిరి పోలీస్​ స్టేషన్​, ఘట్కేసర్​ పోలీస్​ స్టేషన్​లలో డ్రగ్స్​ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. రెండవ నిందితుడు సుమంత్​ నేరెడ్​మెట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో డ్రగ్స్​ అమ్ముతూ పోలీసులకు చిక్కాడు. డ్రగ్స్​ అమ్ముతున్న వారిలో ఇద్దరు విద్యార్థులు కూడా ఉన్నారు. పిర్జాదిగూడకు చెందిన గన్నయ్య చేతన్​(23) నగరంలోని ఓ ఇంజనీరింగ్​ కాలేజీలో బిటెక్​ చదువుతున్నాడు. డ్రగ్స్​కు అలవాటు పడ్డ చేతన్​ అలియాస్​ బబ్లూ ఆ తర్వాత డ్రగ్స్​ సబ్​ పెడ్లర్​గా మారాడు. మదీనగూడకు చెందిన మరో విద్యార్థి సాయి కిరణ్​ చదువుకుంటూనే డ్రగ్స్​ సబ్​ పెడర్ల్​గా మారాడు.