మియాపూర్​ కల్వరీ టెంపుల్లో ఘనంగా క్రిస్మస్​ వేడుకలు
1 min read

మియాపూర్​ కల్వరీ టెంపుల్లో ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

హైదరాబాద్​ వ్యాప్తంగా గురువారం క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుండే చర్చిలు మొత్తం భక్తుల ప్రార్థనలతో సందడిగా మారాయి. మియాపూర్ లోని కల్వరి టెంపుల్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదిన సందర్భంలో కల్వరి టెంపుల్ లో గురువారం ఉదయం 6 గంటల నుండే ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి.

ప్రార్థనలు చేస్తున్న భక్తులు

రెండు తెలుగు రాష్ట్రాల నుండి కల్వరీ టెంపుల్ కి భారీగా క్రైస్తవులు తరలివచ్చారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం కల్వరి టెంపుల్ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని నిర్వాకులు జై రాజ్ తెలిపారు. అనంతరం సతీష్ కుమార్ భక్తులను ఉద్దేశించి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు