హెచ్​సీయూ అడవి నుండి బయటకొచ్చిన జింక.. కారు ఢీకొట్టడంతో మృతి
1 min read

హెచ్​సీయూ అడవి నుండి బయటకొచ్చిన జింక.. కారు ఢీకొట్టడంతో మృతి

 

హైదరాబాద్ సెంట్రల్​ యూనివర్సిటీ అటవీ ప్రాంతంలో నుండి ఓ జింక దారి తప్పి గచ్చిబౌలి లింగంపల్లి పాత జాతీయ రహదారిపైకి వచ్చింది. ఇదే సమయంలో అటూగా వెళ్తున్న ఓ కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డ ఆ జింక చికిత్స పొందుతూ మృతి చెందింది.

శనివారం ఉదయం హెచ్​సీయూ అటవీ ప్రాంతం నుండి జింక తప్పిపోయి  గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిలోని శేరిలింగంపల్లి జోనల్​ కమిషనర్​ అఫీస్​ సమీపంలో అలిండ్​ కంపెనీ ప్రహారీ గోడ వద్ద తిరుగుతూ కనిపించింది. దీంతో స్థానికులు, రోడ్డు వెంట వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

జింక ఒక్కసారిగా రోడ్డుపైకి చేరడంతో అటూగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింకకు తీవ్ర గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హెచ్​సీయూ యామిన్​ ప్రొటెక్షన్​ టీంకు, సిటిజన్స్​ ఫర్​ యానిమల్స్​ ఎన్జీఓకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎన్జీఓ సభ్యులు స్థానికుల సహాయంతో జింకను వన్యప్రాణి అంబులెన్స్​లో సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జింక మృతి చెందింది.