Telangana
స్కూళ్లకు సంక్రాంతి సెలవులు వచ్చేశాయ్
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సెలవుల కోసం స్కూళ్లు, కాలేజీల విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఎదురుచూస్తుంటారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూళ్లకు సెలవులను ప్రకటించింది. ఇప్పటికే నూతన సంవత్సర అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 2026 సంవత్సరం జనవరి నెల 10వ తేది నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. 18వ తేది వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. ఈ సంక్రాంతి సెలవులు రాష్ర్టంలోని […]
రేపే శిల్పకళా వేదికలో నాట్య తోరణం
హైదరాబాద్, వార్తమ్యాన్ : అమృత కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతియేటా నిర్వహిస్తున్న నృత్య పండుగ మళ్లీ వచ్చేసింది. సంప్రదాయ నాట్యానికి పెద్దపీట వేస్తూ నిర్వహించే ఈ నాట్య తోరణం ఆదివారం హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పలు నాట్య రీతుల ప్రత్యక్ష కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీఅట్టం, ఒడిస్సీ, జుగల్‌బందీ రీతులను పలువురు కళాకారిణులు ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా […]
చరిత్రను తిరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే
ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు.. హైడ్రా కమిషనర్‌కు ఐఈఐ తరఫున ప్రత్యేక అవార్డు.. చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజనీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. చరిత్రను తరగ రాయడం ఇంజనీర్ల చేతుల్లోనే ఉందని, అందుకు ఆదర్శం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని పేర్కొన్నారు. సమస్య తెలుసుకోవడంతో పాటు పరిష్కారం చూపడం కూడా ముఖ్యమని తెలియజేశారు. మూసీకి వరదలు నివారణతో పాటు నగరానికి తాగునీటి సమస్య పరిష్కారానికి జంటజలశయాలను నిర్మించి హైదరాబాద్ […]
మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్ నేరస్థులు అరెస్ట్..
26 కేసుల్లో 42 రిఫండ్ అర్డర్స్ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్.. ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్ క్రైమ్ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్ క్రిమినల్స్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్ ఫ్రాడ్, మోసపూరిత ఫ్రాడ్ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్ ఆర్డర్స్ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్ చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ […]
