హైటెక్‌సిటీలోని ఆ రూట్లో ఈ ఐదు రోజులు ట్రాఫిక్ తిప్పలే..
హైటెక్‌సిటీలో ఐదు రోజుల వాహనదారులు ట్రాఫిక్ తిప్పలు తప్పేలా లేవు. ప్రధాన రహదారిపై రోడ్డు కుంగడంతో రిపేర్ చేయడానికి అలస్యం అయ్యే పరిస్థితులు ఉన్న కారణంగా ఆ రోడ్డును ట్రాఫిక్ పోలీసులు ఐదు రోజుల పాటు క్లోజ్ చేయనున్నారు. దీంతో ఐకియా నుండి సైబర్ టవర్స్ మీదుగా జేఎన్‌టీయూ వెళ్లే వెహికిల్స్ మరో రూట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాదాపూర్ సైబర్ గేట్ వద్ద రోడ్డు కుంగిపోవడంతో ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే రూట్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. కుంగిన రోడ్డును టీజీఐఐసీ ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతు పనులు చేపట్టారు. ఈ రూట్లో ట్రాఫిక్ సజావుగా కొనసాగేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని మాదాపూర్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ఐదు రోజుల పాటు ఐకియా నుండి సైబర్ టవర్స్, జేఎన్‌టీయూ వైపు వెళ్లే వాహనదారులు ఐకియా నుండి వచ్చే వాహనాలు లెమన్ ట్రీ హోటల్ / రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద ఎడమ వైపు తిరిగి టెక్ మహీంద్రా–సీఐఐ జంక్షన్ నుండి కుడి వైపు తిరిగి జేఎన్‌టీయూ వైపు వెళ్లాలి. వాహనదారులు పోలీసులకు సహకరించి, సూచించిన మార్గాలను అనుసరించి రాకపోకలు సాగించాలని పోలీసులు కోరారు.
