లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్​ ఎస్​ఐ వినయ్​
1 min read

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మాదాపూర్​ ఎస్​ఐ వినయ్​

 

 హైకోర్టు నోటీసులు ఇచ్చేందుకు లక్ష లంచం డిమాండ్ చేసిన ఎస్​ఐ

 

రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఎస్​ఐ వినయ్

 

పోలీస్​ డిపార్ట్​మెంట్​లో మరో అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది.  ఓ కేసులో  నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని మాదాపూర్​ సబ్​ ఇన్​స్పెక్టర్​ వినయ్​ లక్ష రూపాయలు లంచం డిమాండ్​ చేసి మొదటి విడుతలో రూ.50వేలు తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

 

మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మహిళ తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వకపోడంతో ఓ ఫైనాన్షియల్​ కన్సల్టెన్సీకి చెందిన వ్యక్తి మీద మాదాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఎస్​ఐ వినయ్​ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదే కేసుపై సదరు వ్యక్తి హైకోర్టుకు వెళ్లడంతో..అతనికి నోటీసులు ఇచ్చి విచారించాలని పేర్కొంది. దీంతో ఎస్​ఐ వినయ్​ నోటీసులు ఇచ్చేందుకు బాధితుడిని లక్ష రూపాయలు లంచం డిమాండ్​ చేశాడు.

 

అంత డబ్బు ఇచ్చుకోలేను అని చెప్పడంతో ఎస్​ఐ రెండు దఫాలుగా ఇవ్వాలని తెలియజేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం బాధితుడు మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​లో ఎస్​ఐ వినయ్​కు రూ. 50 వేలు డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

 

ఎస్​ఐను అదుపులోకి తీసుకొని అతని సెక్షన్​లో విచారణ చేపట్టారు. అనంతరం ఎస్​ఐ వినయ్​ను అరెస్ట్​ చేసి ఏసీబీ కోర్టులో హజరు పరిచి రిమాండ్​కు తరలించారు. ఈ వ్యవహారంలో మాదాపూర్​ ఇన్​స్పెక్టర్​తో పాటు ఇతర ఉన్నతాధికారులకు ఏమైనా లింకులు ఉన్నాయా అని ఏసీబీ అధికారులు అరా తీస్తున్నారు.