ఆదరహో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా హైదరాబాద్‌కి తిరిగి వచ్చేసింది. మాదాపూర్ శిల్పారామంలో ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఘనంగా ప్రారంభమైంది.
ఈ నెల 8వ తేది వరకు నిర్వహించే ఈ మేళాలో ఒడిశా సాంప్రదాయాలు, కళలు, హస్తకళా ఉత్పత్తులు, వంటకాలు, జానపద నృత్యాలు, శాస్ర్తీయ ప్రదర్శనలతో కనువిందు చేయనున్నాయి.

మేళాను శిల్పారామం స్పెషల్ అఫీసర్ జి. కిషన్‌రావు, ఎన్ఎండీసీ మాజీ డైరెక్టర్ డి.కె. మహంతి ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు.

మేళా సందర్భంగా నృత్యపురి డాన్స్ అకాడమీ ప్రదర్శించిన ఒడిశి, సంబల్పురి నృత్యాలు ఆకట్టుకున్నాయి. సుచీ గ్రూప్ ప్రదర్శించిన జానపద నృత్యాలు, స్టార్ సింగర్ ఈశ్వరి బెహేరా గానం, బనిశ్రీ కళానికేతన్ ప్రదర్శించిన గిరిజన నృత్యాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
