హైటెక్​సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం
1 min read

హైటెక్​సిటీలో కుంగిన రోడ్డు… తప్పిన పెను ప్రమాదం

 

ఐటీ కారిడార్​లో నిత్యం వాహనాలతో అత్యంత రద్దీగా ఉండే ఆ రోడ్డులో ఒక్కసారిగా రోడ్డు కుంగి  భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ రూట్​లో భారీగా ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఐకియా నుండి జేఎన్​టీయూ వెళ్లే రూట్​లో సైబర్​ గేట్​వే ఎదురుగా ఉన్న ప్రధాన రోడ్డు శుక్రవారం సాయంత్రం కుంగిపోయింది. రోడ్డు కుంగడంతో ఈ రూట్​లో వెళ్లే వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.

ఐటీ ఉద్యోగులు ఇండ్లకు వెళ్లే సమయం కావడం, జేఎన్​టీయూ వెళ్లే ప్రధాన రోడ్డు ఇదే అవ్వడం, ఇదే సమయంలో రోడ్డు కుంగి గొయ్యి ఏర్పడడంతో ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. సైబరాబాద్​ ట్రాఫిక్​ పోలీసులు వెంటనే కుంగిన రోడ్డు వద్ద సూచిక బోర్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్​ను నియంత్రించారు. రోడ్డు పక్కనే ఉన్న అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పైప్​లైన్​ నుండి మురుగునీరు లీకేజీ అవ్వడం వలనే రోడ్డు కుంగిదని తెలుస్తోంది. ప్రస్తుతం కుంగిన రోడ్డుకు టీజీఐఐసీ అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.