తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ నూతన ప్రెసిడెంట్​గా సురేష్​బాబు ఎన్నిక
1 min read

తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​ నూతన ప్రెసిడెంట్​గా సురేష్​బాబు ఎన్నిక

తెలుగు ఫిల్మ్​ ఛాంబర్​కు జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత డి. సురేష్​బాబు నూతన  ప్రెసిడెంట్​గా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఫిల్మ్​ ఛాంబర్​ ఎన్నికల్లో ప్రో గ్రెసివ్​ ప్యానెల్​ పేరుతో సినీ ఇండస్ర్టీలోని పెద్ద నిర్మాతలు, మన ప్యానల్​ పేరుతో చిన్న నిర్మాతలు పోటీ చేశారు.

ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్​ ప్యానెల్ మద్దతుతో డి. సురేష్​బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 48 మంది కార్యవర్గ సభ్యులు ఉన్న ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్​ ప్యానెల్​ నుండి 31 మంది, మన ప్యానెల్​ నుండి 17 మంది గెలుపొందారు.

 

ఫిల్మ్​ ఛాంబర్​ ఉపాధ్యక్షుడిగా నాగవంశీ, కార్యదర్శిగా అశోక్​కుమార్​, కోశాధికారిగా రామదాసులు గెలుపొందారు. ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగుతంది.