అట్టహాసంగా ముగిసిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా..
మాదాపూర్ శిల్పారామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా ఆదివారం సందడిగా ముగిసింది. ఈ మేళాలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కళలు, హస్తకళలు, సంప్రదాయ వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

ఈ మేళాలో ఒడిశాకు ప్రత్యేకమైన హస్తకళలు, హ్యాండ్లూమ్స్తో 30కిపైగా క్రాఫ్ట్ స్టాల్స్ అలాగే సంప్రదాయ ఒడియా వంటకాలను అందించిన 20 ఫుడ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకున్నాయి.

ముగింపు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యపురి డాన్స్ అకాడమీ ద్వారా ఒడిస్సీ నృత్యం, నాద్భేడ్ బృందం ద్వారా సాంబల్పురి నృత్యం, ఎస్ఓడబ్ల్యూడబ్ల్యూ కళాకారుల మధుర గానాలు, అలాగే ప్రసిద్ధ ప్రిన్స్ డాన్స్ గ్రూప్ నిర్వహించిన అద్భుతమైన గ్రాండ్ ఫినాలే ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి.

ఈ మేళా ఒడిశా సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడంలో, సమాజంలో ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించి, సందర్శకులకు మరిచిపోలేని అనుభూతులను అందించింది
