హైటెక్స్‌లో హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ షురూ
ఆకట్టుకుంటున్న లెర్నింగ్, ఇంటరాక్టివ్, అడ్వెంచర్ జోన్స్, రోబోటిక్స్ వర్క్‌షాపులు
మాదాపూర్ హైటెక్స్ వేదికగా హైదరాబాద్ కిడ్స్‌ఫెయిర్ 18వ ఎడిషన్ శనివారం ప్రారంమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ కిడ్స్ ఫెయిర్ తొలిరోజు చిన్నారుల సందడితో కళకళలాడింది. ఈ కార్యక్రమాన్ని హైటెక్స్ బిజినెస్ హెడ్.డ్ టి.జి. శ్రీకాంత్ తో పాటు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ మార్కెటింగ్ హెడ్ సూర్య వర్కోలు, శ్రీక ఇంటర్నేషనల్ మైక్రో ప్రీ స్కూల్ అడ్మిషన్స్ హెడ్ దుర్గం సంధ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా హైటెక్స్ బిజినెస్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన పిల్లల ఎక్స్‌పోలలో ఒకటిగా హైదరాబాద్ కిడ్స్ ఫెయిర్ ఎదిగిందన్నారు. వినోదం, విద్య, సృజనాత్మకత, ఫిట్నెస్, కుటుంబ వినోదం అన్నింటినీ సమతుల్యం చేసే వేదికగా అభివర్ణించారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు ఈ ఫెయిర్ అందుబాటులో ఉంటుందన్నారు.

ఈ కిడ్స్ ఫెయిర్‌లో లెర్నింగ్, ఇంటరాక్టివ్, అడ్వెంచర్ జోన్స్, టాలెంట్ షోస్, రోబోటిక్స్ వర్క్‌షాపులు, క్లైంబింగ్ వాల్, మరెన్నో ప్రదర్ళనలు కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు. న్యూట్రిషన్, విద్య, లైఫ్‌స్టైల్, బొమ్మలు, పుస్తకాలు, హాబీలు తదితర విభిన్న విభాగాలకు చెందిన అనేక ఉత్పత్తులు సేవలు ఈ ఫెయిర్‌లో ప్రదర్శించారు.

ప్రత్యేక ఆకర్షణగా కిడ్స్ బిజినెస్ కార్నివల్ (రెండో ఎడిషన్) లో భాగంగా 60 మందికి పైగా చిన్నారుల వ్యాపారవేత్తలు తమ ఆలోచనలు, ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. హెచ్‌కెఎఫ్ 2025లో పిల్లల కోసం అనేక ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ జోన్లు, జిగిల్ మగ్- జంగిల్ థీమ్‌తో కిడ్స్ రన్, ప్లే గ్రౌండ్ కన్స్ట్రక్షన్స్ నిర్వహించే కన్ స్ట్రక్షన్ యాక్టివిటీస్ జోన్ ఆకట్టుకుంటున్నాయి.

గేమాలజీ జోన్ లో నాన్–డిజిటల్ గేమ్స్, లీప్ రోబోట్స్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ వర్క్‌షాపులు, చిల్డ్రన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సర్టిఫికేషన్ యాక్టివిటీ, క్రెగ్ స్టూడియో నిర్వహించే క్లైంబింగ్ వాల్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. పాఠశాలలు నిర్వహించే ఉచిత యాక్టివిటీ సెషన్లు చిన్నారుల సృజనాత్మకతను వెలికియనున్నాయి.
