శేరిలింగంపల్లి సర్కిల్​ ఏసీపీ వెంకటరమణపై చర్యలు తీసుకోండి
1 min read

శేరిలింగంపల్లి సర్కిల్​ ఏసీపీ వెంకటరమణపై చర్యలు తీసుకోండి

ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్​ఎస్​ నేత మిద్దెల మల్లారెడ్డి

 

శేరిలింగపల్లి సర్కిల్​ టౌన్​ ప్లానింగ్ అసిస్టెంట్​ సిటీ ప్లానర్​ వెంకటరమణపై అవినీతి అరోపణలు వచ్చిన ఆ అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని శేరిలింగంపల్లి బీఆర్​ఎస్​ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి జీహెచ్​ఎంసీ అధికారులను నిలదీశారు. ఏసీపీ వెంకటరమణ, చైన్​మెన్​ మోహన్​పై చర్యలు తీసుకోవాలని సోమవారం శేరిలింగంపల్లి సర్కిల్​లో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

 

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి సర్కిల్​ పరిధిలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వీటిపై ఎన్నీ సార్లు ఫిర్యాదు చేసిన శేరిలింగంపల్లి టౌన్​ ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, టీపిఎస్​లు, చైన్​మెన్లు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. అక్రమ నిర్మాణాలపై నిలదీస్తే సీజింగ్​ పేరిట వసూళ్ల దందాకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏసీపీ వెంకట రమణపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.