సందర్శకులతో కళకళలాడుతున్న శిల్పారామం
శిల్పారామం సందర్శకులతో కళకళలాడుతుంది. వారంతం కావడం, దీనికి తోడు అల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కొనసాగుతుండడంతో పెద్ద ఎత్తున సందర్శకులు శిల్పారామంకు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తులు సందర్శకులను ఆకట్టుకుంటున్నవి.

కోట , ఝామదని , తస్సార్, దాఖ, బనారసీ, కార్పెట్స్, జ్యూట్ బ్యాగ్స్, జ్యూట్ బొమ్మలు, , అలంకరణ వస్తువులు, గృహాఅలంకరణ వస్తువులు, బాంబు బుట్టలు, కుర్చీలు, బ్లూ పాఠరీ, టెర్రకోట ఉత్పత్తులు, డ్రెస్ మెటీరియల్స్, జ్యువలరీ, మరి ఎన్నో చేనేత హస్తకళా ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి.

శ్రీమతి దుర్గ మైత్రయి శిష్య బృందం వీణ వాదన ఎంతగానో అలరించింది. ఢిల్లీ నుండి విచ్చేసిన కూచిపూడి నాట్య గురువులు సీతనాగ జ్యోతి , నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి ప్రదర్శన ఎంతగానో అలరించింది. సౌత్ జోన్ కల్చరల్ స్త్రే తంజావూర్ సంయుక్త నిర్వహణ లో శశాంక్ శంకర్ దుబయ్ బృందం సంబల్పూరి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కళాకారులతో పటు సందర్శకులు కూడా డప్పు చప్పుళ్లకు నాట్యం చేసారు.
