1 min read

టౌన్​ ప్లానింగ్​పైనే ఎక్కువ ఫిర్యాదులు

 

గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​లోని మియాపూర్​ సర్కిల్​ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అత్యధికంగా టౌన్​ ప్లానింగ్​ విభాగంపైనే ఫిర్యాదులు వచ్చాయి. సర్కిల్​ డిప్యూటీ కమిషనర్​ శశిరేఖ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.

మొత్తం 24 ఫిర్యాదులు రాగా అందులో టౌన్​ ప్లానింగ్​ విభాగానికి16, ఇంజనీరింగ్​ విభాగానికి 5, యూబీడీ విభాగానికి ఒకటి, రెవెన్యూ విభాగానికి రెండు ఫిర్యాదులు అందాయి. సర్కిల్​ పరిధిలో అనేక అక్రమ నిర్మాణాలు కొనసాగుతుండడంతో స్థానికులు పెద్ద ఎత్తున వాటిపై ఫిర్యాదులు అందజేశారు.

వీటిని స్వీకరించిన డీసీ ఆయా విభాగాల అధికారులను వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఏఎంసీ బిక్షపతి, ఏసీపీ రాణి, డీఈ వశిధర్​, ఏఎంఓహెచ్​ శ్రీకాంత్​రెడ్డి, ఎస్​ఎస్​ శ్రీనివాస్​ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.