శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..
1 min read

శేరిలింగంపల్లి అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గాంధీ అభివృద్ధి మర్చిండు..

 

శేరిలింగంపల్లి లో వెక్కిరిస్తున్న శిలాఫకాలు..

 

పాత వాటి స్థనాల్లో కొత్త శిలాఫలకాలే.. తప్ప ఒక ఇటుక పేర్చలే

 

బీఆర్​ఎస్​ లీడర్​, చందానగర్ మాజి కార్పొరేటర్ నవతా రెడ్డి..

 

త్వరలోనే జరుగనున్న గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ ఎన్నికల వేళ అభివృద్ధి పనుల పేరిట కొత్త శిలఫలకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలఫలకాలు వేసి వదిలేసి ఒక్క పనికూడా చేయని ప్రజాప్రతినిధులు ప్రస్తుతం మరోసారి ఈ తంతు మొదలుపెట్టారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో పెట్టిన శిలాఫలకాలకే దిక్కు దీవాణం లేదని, ప్రస్తుతం కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్న సమయంలో మళ్ళీ కొత్త శిలాఫలకాల ఏర్పాటు నాటకం ఆడుతున్నారని బొబ్బా నవతా రెడ్డి మండిపడ్డారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారాను అని చెబుతున్న ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకురాలు, చందానగర్ మాజీ కార్పోరేటర్ బొబ్బా నవతా రెడ్డి నిలదీశారు.

ఆదివారం చందానగర్ లోని పలు కాలనీలో నవతా రెడ్డి పర్యటించి గతంలో అభివృద్ధి పనుల పేరిట వేసిన శిలాఫలకాల స్థానంలో ఎలాంటి పనులు చేయకుండానే కొత్తవి ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో నిధులు లేక గత 2 సంవత్సరాలుగా శిలాఫలకాలు ప్రజలను వెక్కిరిస్తున్నాయని ఎద్దేవా చేశారు. జిహెచ్ ఎంసీ లో నిధులు లేవని, కానీ శేరిలింగంపల్లి లో శిలాఫలకాలు మాత్రం భారీగా వేస్తున్నారని తెలిపారు.

చందానగర్ డివిజన్ శంకర్ నగర్ కాలనీ లో ఎమ్మెల్యే ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా 15 లక్షల రూపాయలతో యూత్ భవనం నిర్మాణం కోసం గత 2 సంవత్సరాల క్రితం పెద్ద అక్షరాలతో శిలాపలకం వేసి ఎలాంటి పనులు చేయలేదని, దాని స్థానంలోనే తిరిగి శనివారం రోజుల అదే శంకర్ నగర్ కాలనీ లో కొత్త శిలాఫలకం వెలసిందని అన్నారు. ప్రస్తుతం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇలాంటివి వందల సంఖ్యలో శిలాఫలకాలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. ప్రజలు మోసపూరిత మాటలు నమ్మకుండా అప్రమత్తం ఉండాలని నవతా రెడ్డి కోరారు.