కళాభిమానులను ఆకర్షిస్తున్న హైదరాబాద్.. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ రమణారెడ్డి
స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైన హైదరాబాద్ పెరల్స్ ఆర్ట్ క్యాంప్
హైదరాబాద్ మహా నగరం కళాభిమానులను ఎంతగానో ఆకర్షిస్తుందని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ప్రెసిడెంట్ ఎం.వి రమణారెడ్డి అన్నారు. మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ శనివారం 40 మంది కళాకారులతో ‘హైదరాబాద్ పెరల్స్ -I పేరుతో ఆర్ట్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కళా శిబిరాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు అండ్ ఆర్ట్ క్యాంపు క్యూరేటర్ ప్రముఖ శిల్పి ఎంవి రమణా రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం కళాకారులను, కళాభిమానులను ఎంతో ఆకర్షిస్తుందని, నగరంలో కళా కార్యక్రమాలు, కల శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వివిధ కళా కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారులకు వేదిక కల్పిస్తుందని అభినందించారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే. లక్ష్మి ఆర్ట్ క్యాంపు సందర్శించారు.
ఈ ఆర్ట్ క్యాంపు ఈ నెల 26వ తేది వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకు సందర్శకులకు అందుబాటులో ఉందని, శిబిరంలో వేసిన పెయింటింగ్లు 27వ తేదిన ఎగ్జిబిషన్‌కు ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
