మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..
1 min read

మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ట్ర సైబర్​ నేరస్థులు అరెస్ట్​..

  • 26 కేసుల్లో 42 రిఫండ్​ అర్డర్స్​ ద్వారా రూ. 21.98 లక్షలు భాదితులకు రిఫండ్​..

ఆరు రోజుల వ్యవధిలో మూడు సైబర్​ క్రైమ్​ కేసుల్లో నలుగురు అంతరాష్ర్ట సైబర్​ క్రిమినల్స్​ను సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరిలో ముగ్గురు ట్రేడింగ్​ ఫ్రాడ్​, మోసపూరిత ఫ్రాడ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు. 26 కేసుల్లో కోర్టు అనుమతితో 42 రిఫండ్​ ఆర్డర్స్​ ద్వారా రూ 21.98 లక్షలు బాధితులకు రిఫండ్​ చేసినట్లు సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ సాయి శ్రీ వెల్లడించారు.

చీటింగ్​ వెలుగులోకి వచ్చింది ఇలా…

నగరానికి చెందిన ఓ ప్రైవేట్​ ఉద్యోగికి టెలిగ్రామ్‌లో బెన్ సాషా అనే అమ్మాయి నుండి మెసేజ్​ వచ్చింది.ఆమె తనను తాను పరిచయం చేసుకుని ఫారెక్స్ ట్రేడింగ్‌లో పాల్గొనమని ఉద్యోగిని తెలియజేసింది. భారతీయ స్టాక్ మార్కెట్‌లో తనకున్న పరిమిత అనుభవం కారణంగా సదరు ఉద్యోగి మొదట్లో సంకోచించాడు. ఆ తర్వాత బెన్ ​సాషా ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకున్న స్లబ్జెంట్​ అనే యాప్‌ని ఉపయోగించి పేపర్ ట్రేడ్‌లు చేయడానికి అతనికి మార్గనిర్దేశం చేసింది.

డీసీపీ సాయిశ్రీ
డీసీపీ సాయిశ్రీ

సపోర్ట్​ స్రెడెక్స్​. కామ్​  నుండి పొందిన లాగిన్ ఆధారాలతో ఖాతాను సృష్టించి ప్రైవేట్​ ఉద్యోగికి సహాయపడింది.ఈ ట్రేడింగ్​ ట్రయల్ దశలో ఊహాత్మక లాభాలను పొందినట్లు అతన్ని నమ్మించింది. దీంతో సదరు ఉద్యోగి తన వద్ద ఉన్న డబ్బును  పేపర్​ ట్రేడ్​ యాప్​లో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. కమ్యూనికేషన్ స్ప్రెడెక్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా ఈ ట్రేడింగ్​ నిర్వహిచాడు.

ట్రేడింగ్ యూఎస్​ డాలర్లలో ఉంటుందని అతనికి నమ్మించి ట్రేడింగ్ ఖాతాలోకి నిధులను జమ చేయడం కూదరదని చెప్పిన బెన్​ సాషా, తాను సూచించిన బ్యాంక్ ఖాతాలకు డబ్బును  బాధితుడు బదిలీ చేశాడు. ఈ డబ్బును రూపాయాల్లోకి మార్చి క్రెడిట్ చేస్తారని పేర్కొన్నారు. దీంతో బాధితడు మొదటిసారి రూ. 50,000  పెట్టగా రెండుసార్లు రూ 5,000 చొప్పున విత్​డ్రా చేసుకున్నాడు.

ఇలా బాధితుడు వాయిదాలలో డబ్బులు ఇన్వెస్ట్​మెంట్​ చేయడం మొదలుపెట్టాడు. చివరికి రూ.10,00,000 పెట్టుబడి పెట్టగా, ఆ అమ్మాయి కూడా అతని ఖాతాకు రూ.10,00,000 లాభాలు వచ్చినట్లు చూపెట్టింది. ఈ డబ్బును విత్​డ్రా చేసేందుకు బాధితుడు  ప్రయత్నించగా, లాభాలపై 30% పన్ను రూ.2,68,000, సెక్యూరిటీ డిపాజిట్ రూ. 5,75,000, కరెన్సీ మార్పిడి కోసం రూ 3,60,000 డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందని బెన్​సాషా సూచించింది. దీంతో బాధితుడు సదరు డబ్బు మొత్తం ఆమె సూచించిన ఖాతాలకు పంపించాడు. ఆతర్వాత అతని సిబిల్​స్కోరు సరిగ్గా లేదని, సిబిల్​ స్కోరు పెంచేందుకు మరో రూ.15,00,000 పంపాలని చెప్పడంతో బాధితుడికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు.దీంతో బెన్​సాషా అతని చాటింగ్​, ట్రేడింగ్ ఖాతాను డిలీట్​ చేసింది.బాధుతుడికి యాప్‌లో  రూ. 21,93,300 వర్చువల్ లాభాన్ని కూడా చూపించి మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో చీటింగ్​ జరిగినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్​ క్రైమ్​ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.  బాధితుడు తన హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఖాతాల నుండి వివిధ  అకౌంట్లకు రూ. 21,93,300- బదిలీ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇందులో ఒక బ్యాంక్​ అకౌంట్​కు రూ 90,000 ట్రాన్స్​ఫర్​ అయినట్లు గుర్తించారు. సాంకేతిక ఆధారాల ద్వారా  ఇద్దరు నిందితులు సుధాకర్​రెడ్డి, రఘునాథ్​రెడ్డిలను అరెస్ట్​ చేశారు. వీరు సైబర్​ క్రైమ్​ కోసం నిందితులకు బ్యాంక్​ అకౌంట్లను అందించినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరి వద్ద నుండి ఐదు సెల్​ఫోన్లు, ఆరు సిమ్​కార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్​ చేసిన మొత్తం నలుగురు నిందితుల్లో ముగ్గురు ట్రేడింగ్​, మోసపూరిత చీటింగ్​ కేసుల్లో నిందితులుగా ఉన్నారు.